Begin typing your search above and press return to search.

2.ఓ 3డి ప్రొజెక్ష‌న్.. స‌గం సీట్లు ఖాళీ!!

By:  Tupaki Desk   |   18 Nov 2018 6:58 AM GMT
2.ఓ 3డి ప్రొజెక్ష‌న్.. స‌గం సీట్లు ఖాళీ!!
X
తెలుగు మీడియాని చెన్న‌య్ స‌త్యం థియేట‌ర్‌ కి తీసుకెళ్లి మ‌రీ 2.ఓ 3డి విజువ‌ల్స్‌ ని చూపించారు. అక్క‌డ అల్ట్రా సౌండ్ టెక్నాల‌జీ 4డి టెక్ సౌండ్‌ లో .. సీటు కింద నుంచి.. న‌లువైపుల నుంచి ధూంధాంగా వ‌చ్చే శ‌బ్ధాల న‌డుమ‌ 2.ఓ ట్రైల‌ర్ - సాంగ్ ప్రొజెక్ష‌న్‌ ని వీక్షించిన మ‌నోళ్లు ఆహా ఓహో అన్నార‌ట‌. అయితే 150 మంది తెలుగు సినీజ‌ర్న‌లిస్టుల్లో అంద‌రినీ హైద‌రాబాద్ నుంచి విమానం ఎక్కించి తీసుకెళ్లలేక‌పోయారు కాబ‌ట్టి - బ్యాలెన్స్ మీడియా కోసం నేడు హైద‌రాబాద్ - సినీమ్యాక్స్‌ లో 2.ఓ 3డి విజువ‌ల్స్‌ ని ప్ర‌ద‌ర్శించారు.

3డిలో ఎలానూ కొంద‌రు 2.ఓ వీడియోల్ని ఇదివ‌ర‌కూ చూడ‌లేక‌పోయారు కాబ‌ట్టి, ఇప్పుడు సినీమ్యాక్స్‌ లో చూపించిన విజువ‌ల్స్‌ కి ఆహా ఓహో.. కుకూ..!! అన్నారు. అయితే చెన్న‌య్‌ లో చూసేశామ‌ని భావించారో ఏమో కానీ - సినీ మ్యాక్స్ మొత్తం ఖాళీగానే క‌నిపించింది. స‌గం మంది మీడియా ఎందుక‌నో 3డి ప్రొజెక్ష‌న్‌ కి రానేలేదు. వ‌చ్చిన మీడియా వ‌ర‌కూ పెద్ద తెర‌పై 3డి విజువ‌ల్స్‌ ని ప్ర‌ద‌ర్శించారు.

ఇక రోబో శంక‌ర్ త‌డాఖా ఏంటో పెద్ద‌తెర‌పై 3డిలో చూసిన‌ప్పుడే తెలిసింది. వాస్త‌వానికి 2.ఓ లాంటి చిత్రాన్ని మొబైల్‌ లోనో - లేక బుల్లితెర‌ పైనో - పైర‌సీలోనో చూస్తే కిక్కేం ఉండ‌దు. అడ్వాన్స్‌ డ్ 3డి కెమెరాల‌తో తెర‌కెక్కించిన ఈ సినిమాకి సీజీ వ‌ర్క్ రియ‌ల్లీ ఫెంటాస్టిక్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు మీడియా స్పంద‌న చూశాక 2.ఓ తెలుగు రాష్ట్రాల్లో భారీగానే వ‌సూళ్లు చేయ‌డం ఖాయం అన్న మాటా వినిపిస్తోంది. అయితే ఎంత పెద్ద సినిమా అయినా దీనికి మీడియా ప్ర‌చారం ఎంతో ఇంపార్టెంట్ ఇంకా. రిలీజ్ వ‌ర‌కూ హుషారెత్తిస్తేనే జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌వ‌చ్చు. ఆ ప్ర‌య‌త్నం మాత్రం శూన్యం అన్న మాటా వినిపిస్తోంది.