Begin typing your search above and press return to search.

సోగ్గాడి గిత్తలు కుమ్మేత్తున్నాయ్‌!

By:  Tupaki Desk   |   29 Aug 2015 7:41 AM GMT


అక్కినేని వారి సంద‌డి షురూ అయిపోయింది. మ‌న్మ‌థుడు నాగార్జున పుట్టిన‌ రోజుకి ఒక రోజు ముందుగానే అఖిల్ త‌న పోస్ట‌ర్‌ తో అద‌ర‌గొట్టేశాడు. సూర్యుడిలాంటి శ‌క్తితో ఆ పోస్ట‌ర్‌ లో త‌ళుక్కున మెరిశాడు. నాగ్ మ‌రో త‌న‌యుడు నాగ‌చైత‌న్య సినిమాకి సంబంధించిన టీజ‌ర్ కూడా మ‌రికొన్ని గంట‌ల్లోనే విడుద‌ల కాబోతోంది. అఖిల్ సినిమా టీజ‌ర్ కూడా త్వ‌ర‌లోనే స‌ల్మాన్‌ ఖాన్ చేతుల‌మీదుగా బ‌య‌టికొస్తోంది. వాళ్లిద్ద‌రి కంటే ముందుగా నాగ్ త‌న `సోగ్గాడే చిన్ని నాయ‌నా` టీజ‌ర్‌ ని విడుద‌ల చేశాడు. ఆ టీజ‌ర్ లో నాగ్ నిజంగానే సోగ్గాడి గా అందంగా క‌నిపించాడు. రెండు వేరియేష‌న్స్‌ లో అద‌ర‌గొట్టాడు. ఈ సినిమాలో సోగ్గాడిగా తండ్రి పాత్ర‌లో నాగార్జున క‌నిపిస్తాడు. కొడుకు పాత్ర‌లోని నాగార్జున ఓ డాక్ట‌ర్‌ గా అమాయ‌కంగా క‌నిపిస్తుంటాడు.

మంచి బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌ తో సింపుల్‌ గా టీజ‌ర్ సాగుతోంది. నాగ్‌, ర‌మ్య‌కృష్ణ క‌లిసి చెబుతున్న గోదావ‌రి యాస‌లోని డైలాగులు టీజ‌ర్‌ కి అట్రాక్ష‌న్‌ గా మారాయి. `నిన్ను సూత్తుంటే ఏమ‌నిపిస్తోందో తెలుసా? గుండెల్లో గిత్తలు కుమ్మేత్తున్న‌ట్టున్నాయే` అంటూ నాగ్ చెప్పిన గోదావ‌రి డైలాగులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఆయ‌న ఈ సినిమాలో మ‌రింత యంగ్ లుక్‌ లో క‌నిపిస్తున్నాడు. సినిమా ఫ్లేవ‌ర్ చూస్తుంటే మొత్తం ఎంట‌ర్‌ టైన్‌ మెంట్ బేస్ లో సాగుతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. క‌ళ్యాణ్‌ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబ‌రులో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంద‌ని స‌మాచారం.