Begin typing your search above and press return to search.

లోగోతో విచ్చేసిన సోగ్గాడు!!!

By:  Tupaki Desk   |   29 Aug 2015 4:36 AM GMT
లోగోతో విచ్చేసిన సోగ్గాడు!!!
X
సోగ్గాడే చిన్నినాయనా.. అంటూ అప్పట్లో ఏ.ఎన్‌.ఆర్‌. ను ఉద్ద్యేశించి ఓ పల్లె పడుచు పాడుతుంటే ఆ కిక్కే వేరబ్బా అనుకున్నారు గోల్డెన్‌ ఏజ్‌ కాలంనాటి జనాలు. ఇక ఆ తరువాత చాలామంది అలాగే అనుకున్నారులే. అయితే ఇదే పాటను టైటిల్‌ గా చేసుకుంటూ పెద్దాయన వారసత్వం పుణికి పుచ్చుకున్న కింగ్‌ నాగార్జున ఇప్పుడు ఏకంగా డబుల్ ట్రీట్‌ ఇస్తూ రంగంలోకి దిగిపోయాడు.

నూతన దర్శకుడు కళ్యాణ్‌ రూపొందిస్తున్న సినిమా ''సోగ్గాడే చిన్నినాయనా''. పూర్తి ఫ్యామిలీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో నాగ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమాతో మరోసారి తన డబుల్ యాక్టింగ్‌ డోస్‌ ను ప్రేక్షకులకు అందించడానికి ఒకటి మాసూ, ఒకటి క్లాసు పాత్రలతో ఉతికి ఆరేశాడంతే. సీనియర్‌ నాగ్‌ పక్కన సెన్సిబుల్‌ హీరోయిన్‌ రమ్యకృష్ణ జోడీగా నటిస్తుంటే, జూనియర్‌ ప్రక్కన లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఇకపోతే ఈరోజు నాగ్‌ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా లోగో లుక్‌ ను లాంచ్‌ చేశారనుకోండి. నాగ్‌ యంగ్‌ లుక్ తో ఆపటు లోగో కూడా ఫుల్‌ గానే కిక్కిచ్చింది. మొత్తానికి అక్కినేని అభిమానులకు బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్యామిలీ అంతా బాగానే కిక్కిస్తున్నారండీ...