Begin typing your search above and press return to search.

ఓరి నా బత్తాయో.. పెళ్ళి కూడా చేసుకుందే

By:  Tupaki Desk   |   26 April 2017 4:17 AM GMT
ఓరి నా బత్తాయో.. పెళ్ళి కూడా చేసుకుందే
X
మోడల్ నుంచి యాక్టర్ గా మారిన సోఫియా.. సెక్స్ బాంబ్ గా గుర్తింపు సంపాదించింది. అంతలోనే తాను ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తానని.. దేవుళ్లంతా తన బిడ్డలేనని చెప్పి నన్ గా మారిపోయానంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేసి, హిమాలయాలు కూడా చుట్టేసింది.

గాయా మదర్ సోఫియా అని పేరు పెట్టేసుకుని బాగానే హల్ చేసిన సోఫియా.. సోషల్ మీడియాలో సెక్సీ పోజులను మాత్రం వదిలిపెట్టలేదు. అంతలోనే తను రొమేనియన్ వ్యక్తి వ్లాడ్ స్టానెస్కూను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పి సడెన్ షాక్ ఇచ్చిన సోఫియా హయత్.. ఇప్పుడు ఆ తతంగం కూడా కానిచ్చేసింది. రీసెంట్ గా తన కాబోయే భర్త వ్లాడ్ తో కలిసి మక్కా దర్శనం కూడా పూర్తి చేసుకున్న సోఫియా.. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంది కూడా. ఈజిప్షియన్ ఆచారాల ప్రకారం సోమవారం పెళ్లి చేసుకున్నారు వ్లాడ్- సోఫియాలు. ఇలా తను పెళ్లి చేసుకోవడం కూడా దేవుడి ఆదేశమే అంటూ సమర్ధించేసుకుంది సోఫియా.

ఆ సంగతి అలా ఉంటే.. ఈ పెళ్లి ఫోటోలు వగైరా చూస్తుంటే మాత్రం.. సోఫియా హయత్ మాంచి జోడీనే వెతుక్కుందని చెప్పాలి. పెళ్లికి ముందు రోజున ఇవాళే మిస్ గా ఆఖరి రోజు.. పెళ్లి రోజు కోసం ఇక ఎదురుచూడలేకపోతున్నా లాంటి పోస్ట్ లతో అలరించిన సోఫియా.. 4 తెల్ల గుర్రాల రథంపై వెన్యూకు వచ్చి.. గ్రాండ్ రాయల్ వెడ్డింగ్ నే చేసుకుంది. మొత్తానికి సోఫియా హయత్ మ్యారేజ్ ఓ సెన్సేషన్ అనాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/