సూపర్ హాట్ తెలుగమ్మాయి!!

Sat Jan 13 2018 18:00:01 GMT+0530 (IST)

తెలుగు అమ్మాయిలు అయితే అందాలు ఆరబోసేందుకు సిద్ధంగా ఉండరు అని టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి గాట్టి నమ్మకం. అందుకే మన భామలకు హీరోయిన్ అవకాశం ఇచ్చేందుకు అస్సలు ముందుకు రారు. ఎంతసేపూ పక్క చూపులు తప్ప.. ఇక్కడి అందాల మెరుపులు పట్టించుకోరు.కానీ ఇవన్నీ ఒట్టి భ్రమలు.. భ్రాంతులు మాత్రమేనని.. గ్లామర్ వరల్డ్ కి ఏం కావాలో అవన్నీ మన చక్కని చుక్కలకు ఉన్నాయని ప్రూవ్ చేస్తోంది శోభిత ధూళిపాళ. 2013లో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకున్న  బ్యూటీ.. అసలు ఊరు వైజాగ్. ఇప్పటికే బాలీవుడ్ మూవీ రమన్ రాఘవ్ 2.ఓ చిత్రంలో నటించి ట్యాలెంట్ చూపించేసింది. తన ఫిజిక్ తో ఎలాంటి వారికైనా మత్తెక్కించగల సౌందర్యం ఈమె సొంతం. ఆ అందాలను అద్భుతంగా కెమేరా ముందు ఉంచగలిగే తెగువ అన్నిటి కంటే ముఖ్యం.

రీసెంట్ గా ఈ సుందరి ఓ ఫోటో షూట్ చేసింది. టూ పీస్ మైక్రో వేర్ ధరించి.. సైడ్ యాంగిల్ నుంచి శోభిత ఇచ్చిన పోజులు చూసి.. గ్లామర్ లవర్స్ మైమరచిపోతున్నారు. ఇంత హాట్ నెస్ ను కెమేరా ముందు ఓ తెలుగమ్మాయి పంచగలగడం.. దాదాపుగా మొదటిసారి కావడం గమనించాలి. ప్రస్తుతం శోభిత ధూళిపాళ ఓ తెలుగు సినిమాలో నటించేస్తోంది. అడివి శేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రంలో తన అద్భుతమైన అందాలకు ప్రతిభను మిక్స్ చేసి మనోళ్లకు చూపించడానికి వచ్చేస్తోంది శోభిత.