Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: తెలుగు బ్యూటీ ఇంటర్నేషనల్ లుక్

By:  Tupaki Desk   |   19 Sep 2019 10:30 AM GMT
ఫోటో స్టొరీ: తెలుగు బ్యూటీ ఇంటర్నేషనల్ లుక్
X
తెలుగు అమ్మాయిలు మోడలింగ్ రంగంలో జాతీయ స్థాయిలో సత్తా చాటిన వారు చాలా అరుదు. ఆ లోటును శోభిత ధూళిపాళ తీర్చేసింది. ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో సెకండ్ ప్లేస్ సాధించిన ఈ భామ ఆదే ఏడాది మిస్ ఎర్త్ 2013 పోటీల్లో ఇండియా తరఫున పాల్గొంది. పాపులర్ కింగ్ ఫిషర్ క్యాలెండర్ కు కూడా మోడల్ గా పనిచేసింది. ఇక బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. అడివి శేష్ 'గూఢచారి' తో టాలీవుడ్ ను కూడా ఒక చూపు చూసింది.

మోడలింగ్ నేపథ్యం కావడంతో శోభిత రెగ్యులర్ గా ఫోటో షూట్లలో పాల్గొంటూ ఉంటుంది. తాజాగా మరోసారి అలానే వెర్వ్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజిపై మెరిసింది. వెర్వ్ మ్యాగజైన్ వారు ఈ ఫోటోను తమ అధికారిక ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి పెద్ద క్యాప్షనే ఇచ్చారు. "నేను నన్నెప్పుడూ పోగొట్టుకోలేదు. నేను విభిన్నంగా ఉన్నానని చాలామంది అనేవారు. కొంతమందికి నేను అలా ఉండడం వింతగా అనిపించేది. అయితే నేను వారిలో తప్పు ఉందని అనుకోను. నన్ను కదిలించే.. ఎగ్జైట్ చేసే చాలా విషయాలను గమనించినప్పుడు నాలా ఎవరూ లేరనిపిస్తుంది. నేను విభిన్నంగా ఉన్నాను. అదే నా ప్రత్యేకత. అదే నాకు నమ్మకం ఇస్తుంది. అదే సమయంలో ఆ ఫీలింగ్ నాకు ఒంటరిని అనిపించేలా చేస్తుంది - శోభిత." ఈ క్యాప్షన్లో శోభిత మనసులో తన గురించి ఏమనుకుంటుందో చెప్పేసింది. నిజానికి ఏం ప్రత్యేకత లేకపోతే ఎలాంటి ఘనత కూడా సాధించలేరు.

ఇక ఫోటో విషయానికి వస్తే డార్క్ కలర్ టాప్.. ఒక లెహెంగా ధరించింది. స్లీవ్స్ లేవు కానీ మోచేతి నుంచి కింద స్లీవ్స్ లాంటివి ధరించింది. మెడలో నాలుగైదు చెయిన్లు.. అందులో ఒక పెద్ద క్రాస్ తో మోడరన్ గా ఉంది. ఇక హెయిర్ స్టైల్ అయితే మరింత స్పెషల్ గా ఉంది. చూసేందుకు సాధారణ కొప్పు లానే ఉంది కానీ కొప్పు చివర ఆ హెయిర్ ను జెల్ అప్లై చేసి నిలబెట్టారు. దీంతో కళాత్మకంగా కనిపిస్తోంది. ఇక శోభిత కూర్చున్న స్టైల్.. కళ్ళు మూసుకుని ఇచ్చిన ఎక్స్ ప్రెషన్.. ఫోటో బ్లాక్ అండ్ వైట్ కావడంతో అంతర్జాతీయ స్థాయిలో కనిపిస్తోంది.

శోభిత ప్రస్తుతం సినిమాలతో.. వెబ్ సీరీస్ లతో బిజీగా ఉంది. నివిన్ పౌలీ హీరోగా నటిస్తున్న మలయాళం-హిందీ ద్విభాషా చిత్రం 'మూతోన్' లో హీరోయిన్ గా నటిస్తోంది. మరో మలయాళం సినిమా 'కురూప్' లో కూడా నటిస్తోంది. హిందీలో 'ది బాడీ' అనే చిత్రంలోనూ.. 'బార్డ్ ఆఫ్ బ్లడ్' అనే వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది.