ఫోటో స్టోరీ: సోనమ్ సొగసుల నవ్వులు

Wed May 23 2018 21:37:33 GMT+0530 (IST)

అందగత్తె ఏం చేసినా బాగానే ఉంటుంది. చక్కని దుస్తులు ధరించినా.. వాటిలోంచి తొంగి చూసే సొగసులను ప్రదర్శించినా.. మేని మెరుపులను బయటపెట్టినా.. మైమరిపించేలా నవ్వినా.. చూపరులు కనులు తిప్పుకోవడం చాలా చాలా కష్టం అయిపోతుంది.ఒకవేళ ఒకే ఫోటోలో ఒక భామ అన్నీ చేసిందనుకోండి.. అప్పుడు ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.. సరిగ్గా అదే పని చేసేసింది సోనమ్ కపూర్. ఫెమినా మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కు కవర్ పేజ్ షూట్ చేసింది సోనమ్ కపూర్. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ వేసుకుని.. మోకాళ్లకు అడుగు పైవరకూ బుట్ట బొమ్మ మాదిరిగా డ్రెసింగ్ చేసుకుని.. క్లీవేజ్ అందాలు అన్నిటినీ కెమేరాకు అప్పగించేసింది సోనమ్ కపూర్. అమ్మడు చూపిస్తున్న సొగసుల మెరుపులు ఓ రేంజ్ లో జనాలను మురిపించేస్తున్నాయి.

అయితే.. ఇక్కడ సోనమ్ అందాల కంటే ఎక్కువగా ఆకట్టుకునే పాయింట్ మరొకటి ఉంది. అదే అమ్మడి నవ్వు. చక్కగా నోరంతా తెరచి నవ్వేస్తూ.. పై పలువరుస మొత్తం దర్శనం ఇచ్చేలా నవ్వులు కురిపిస్తోంది సోనమ్. అటు సినిమాల్లోను.. ఇటు కుటుంబ జీవితంలోను.. ఎలాంటి ఫిల్టర్స్ లేని జీవితం తనకు ఇష్టమని చెబుతున్న ఈ భామ.. ఓ రెండు వారాల క్రితమే ఆనంద్ అహూజాను పెళ్లి చేసుకుంది. జూన్ 1న ఈ అందాల భామ నటించిన వీరే ది వెడ్డింగ్ విడుదల కాబోతోంది.