Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హీరో.. బాక్సాఫీస్ జీరో!

By:  Tupaki Desk   |   19 Nov 2017 11:30 AM GMT
బిగ్ బాస్ హీరో.. బాక్సాఫీస్  జీరో!
X
బిగ్ బాస్ సిరీస్ పుణ్య‌మా అని ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చారెంద‌రో. అప్ప‌టివ‌ర‌కూ త‌మ‌కున్న ఇమేజ్‌కు భిన్నమైన క్రేజ్‌ను తెచ్చుకున్న వారెంద‌రో. బిగ్ బాస్ సీజ‌న్ వ‌న్ విజేత‌గా నిలిచిన శివ‌బాలాజీ తెలుగు వారంద‌రికి స‌రికొత్త‌గా సుప‌రిచితుడ‌య్యాడు.

ఆవేశ‌మ‌న్న నెగిటివ్ పాయింట్‌ను పాజిటివ్ గా మార్చుకోవ‌టంలో స‌క్సెస్ అయిన శివబాలాజీ.. బిగ్ బాస్ సీజ‌న్ వ‌న్ విజేత‌గా నిలిచారు. దీంతో.. ఆయ‌న ఇంట‌ర్వ్యూలు మీడియాలో భారీగా వ‌చ్చాయి. ఆయ‌న పాల్గొన్న చిన్న కార్య‌క్ర‌మాల‌కు సైతం పెద్దగా ఫోక‌స్ చేయ‌టం పెరిగింది. ఇలా మారిన ఇమేజ్ వేళ‌.. ఆయ‌న న‌టించిన స్నేహ‌మేరా జీవితం మూవీ రిలీజ్ అయ్యింది.

బిగ్ బాస్ ఇమేజ్ ఈ సినిమాకు ఎంతోకొంత లాభిస్తుంద‌న్న మాట వినిపించింది. అయితే.. అదేమీ వ‌ర్క్ వుట్ కాలేద‌న్న విష‌యం మొద‌టిరోజు వ‌సూళ్ల‌ను చూస్తేనే అర్థ‌మైపోయింది. రాంగ్ టైమింగ్‌.. ప్ర‌మోష‌న్ స‌రిగా లేకుండా సినిమా విడుద‌ల కావ‌టంతో బిగ్ బాస్ విజేత బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బొక్క‌బోర్లా ప‌డ్డారు. అన్ని ఇమేజ్ లు సినిమా స‌క్సెస్‌కు సాధ్యం కాద‌న్న విష‌యం ఈ ఉదంతంతో రుజువైనట్లే.