Begin typing your search above and press return to search.

సైజ్ జీరోలో రెండు లిప్ కిస్సులు

By:  Tupaki Desk   |   27 Nov 2015 8:55 AM GMT
సైజ్ జీరోలో రెండు లిప్ కిస్సులు
X
సైజ్ జీరో కాన్సెప్ట్ చెప్పగానే.. ఇది ఓ లావుపాటి భార్య, అందగాడైన భర్త మధ్య నడిచే స్టోరీ అని అర్ధమైంది. సోనాల్ చౌహాన్ కేరక్టర్ కూడా ఉందని చెప్పగానే.. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే విషయం తెలిసిపోయింది. అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ తనే లావుగా మారిపోయి చేయడమే... ఈ మూవీకి అసలు ఎట్రాక్షన్.

మరి ఇలాంటి మూవీకి క్లీన్ యూ సర్టిఫెకట్ కాకుండా.. యూ/ఏ ఎందుకిచ్చారని ముందునుంచే డౌట్స్ వినిపించాయి. ఇప్పుడా సంగతి తెలిసిపోయింది. సైజ్ జీరో రెండు లిప్ కిస్సులు ఉండడంతోనే ఇలా యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చింది. హీరో ఆర్య.. ఇద్దరు హీరోయిన్స్ తోనూ లిప్ కిస్సులు లాగించేయడం విశేషం. కాకపోతే.. అనుష్కకి ఇచ్చిన ముద్దుని లిప్ లాక్ అనలేం. ఎందుకంటే.. జస్ట్ పెదవులను ఇలా తగిలించి, అలా తీసేశారు. కానీ.. సోనాల్ మాత్రం ఆర్యకి మంచి ముద్దే ఇచ్చింది. కాస్త ఎక్కువసేపే ముద్దు పెట్టింది. స్క్రీన్ పై దాదాపు ఐదు సెకన్లకు పైగా ఉండే ఈ ముద్దు సీన్ బాగా తీశారు. చూసేవాళ్లని కూడా టెంప్ట్ చేసేలా పిక్చరైజ్ చేయడం విశేషం.

ఇప్పటివరకూ టాలీవుడ్ బికినీ బ్యూటీగా పేరు పొందిన సోనాల్ చౌహాన్.. ఇప్పుడు పెదవి ముద్దులకు ఓకే చెప్పేస్తోందనే విషయం.. దీంతో అర్ధమవుతోంది. అయితే.. అనుష్కతో లిప్ లాక్ ఉంటుందని ఆశించిన అభిమానులు మాత్రం నిరుత్సాహపడక తప్పదు. సోలోగానే సినిమా భారాన్ని మోసేసిన స్వీటీ.. ఓ లిప్ కిస్ తోనూ ఫ్యాన్స్ ని ఎంటర్టెయిన్ చేసిందనే అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అనుష్క శెట్టి అడియాశలు చేసేసింది.