Begin typing your search above and press return to search.

షకీలాల మారబోతున్న రమ్యకృష్ణ!

By:  Tupaki Desk   |   21 Jan 2019 7:42 AM GMT
షకీలాల మారబోతున్న రమ్యకృష్ణ!
X
ఒకప్పుడు సౌత్‌ సినీ ప్రేక్షకులను ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్‌ ను తన అందాలతో, సినిమాలతో అలరించిన షకీలా సాఫ్ట్‌ పోర్న్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. మలయాళ సూపర్‌ స్టార్స్‌ ను కూడా షకీలా అప్పట్లో టెన్షన్‌ పెట్టింది. అలాంటి సాఫ్ట్‌ పోర్న్‌ స్టార్‌ గా రమ్యకృష్ణ నటిచబోతుంది. అప్పట్లో హాట్‌ హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్న రమ్యకృష్ణ ఆ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టి అమ్మ పాత్రల్లో, అత్త పాత్రల్లో కనిపిస్తూ వస్తుంది. బాహుబలి శివగామి పాత్రతో ఒక్కసారిగా మళ్లీ స్టార్‌ నటి అయ్యింది.

ప్రస్తుతం ఈమె తమిళంలో 'సూపర్‌ డీలక్స్‌' అనే చిత్రంలో నటించేందుకు సిద్దం అయ్యింది. ఆ చిత్రంలో సాఫ్ట్‌ పోర్న్‌ స్టార్‌ గా రమ్యకృష్ణ కనిపించబోతుంది. జాతీయ అవార్డు గ్రహీత త్యాగరాజ కుమార రాజన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుంది. విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో ట్రాన్స్‌ జెండర్‌ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కనిపించబోతున్న వారంతా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారని, సమాజంలో ప్రత్యేకంగా చూడబడుతున్న పాత్రలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా తమిళ వర్గాల్లో సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ అంటూ ఎవరుండరని, రమ్యకృష్ణ, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నారట.