Begin typing your search above and press return to search.

పవన్ తమ్ముడి రియాక్షన్ కరెక్ట్ కాదేమో

By:  Tupaki Desk   |   21 March 2017 6:29 PM GMT
పవన్ తమ్ముడి రియాక్షన్ కరెక్ట్ కాదేమో
X
పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడు చిత్రం కోసం ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ శుక్రవారమే థియేటర్లలోకి వస్తున్న కాటమరాయుడులో.. పవన్ కు నలుగురు తమ్ముళ్లు ఉంటారనే విషయం తెలిసిందే. అయితే.. ఒక తమ్ముడిగా శివరాయుడి పాత్రను పోషించిన శివబాలాజీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు.

గతంలో మంచి పాత్రలతో ఆకట్టుకున్న శివబాలాజీ.. ఆ తర్వాత రేసులో వెనకబడిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ రావడంతో.. తిరిగి పికప్ అయ్యేందుకు అవకాశం లభించింది. ఆ ఉత్సాహం శివబాలాజీలో కూడా కనిపిస్తోంది. కాటమరాయుడు గురించి అప్ డేట్స్ ఇస్తూ ఆసక్తి కలిగించాడు. అయితే.. ట్రాలింగ్స్ పై ఈ పవన్ తమ్ముడు రియాక్ట్ అవుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాటమరాయుడికి డబ్బింగ్ చెబుతూ అప్డేట్ ఇవ్వడం.. ఓ వ్యక్తి శివబాలాజీని తిట్టడం.. ఇతను సైబర్ క్రైమ్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడం తెలిసిందే.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో శివబాలాజీ ఆవేశంగా మాట్లాడితే.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అతని పేరు మర్చిపోయాడు. దీంతో సోషల్ మీడియాలో శివబాలాజీపై ట్రాలింగ్ పెరిగింది. వీటన్నిటికీ ఓపిగ్గా రియాక్షన్ ఇస్తూ.. ఆవేశపడుతున్నాడు శివబాలాజీ. ఇలాంటి వాటికి సమాధానాలు ఇస్తే.. జనాలు ఇంకా రెచ్చిపోతారన్న చిన్న లాజిక్.. పవన్ సోదరుడు ఎలా మరిచిపోయాడో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/