Begin typing your search above and press return to search.

చందమామ హీరోలు వస్తున్నారు

By:  Tupaki Desk   |   1 Aug 2015 10:26 AM GMT
చందమామ హీరోలు వస్తున్నారు
X
క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. కారణం అందాల చందమామే అనడం అంత సబబు కాదేమో. చందమామ హీరో లైన నవదీప్, శివబాలాజీ అల్లరి తగాదాలు కూడా. కాజల్ కోసం ఆ సినిమాలో వీరిద్దరూ రక్కేసుకుని.. అరిచేసి నానా హంగామా చేశారు. తాజాగా మరోసారి వీరిద్దరూ ఒకే తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

పడ్డానండి ప్రేమలో మరి సినిమా దర్శకుడు మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక్కడ హీరోయిన్ మాత్రం కాజల్ కాదు. అచ్చ తెలుగు అమ్మాయి శ్రీముఖి. చందమామ సినిమా కాజల్ ని ఆకాశానికి ఎగరేసుకెళ్ళినా వీరిద్దరూ మాత్రం ఇక్కడిక్కడే చక్కెర్లు కొడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుల పుణ్యమా అని నవదీప్ అంతో ఇంతో కనపడుతున్నాడు కానీ, శివబాలాజీ శంభో శివ శంభో తరవాత కనపడింది నాని హీరోగా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన జండాపై కపిరాజు లోనే. దర్శకుడిగా మహేష్ ఉప్పుటూరి పడ్డానండి ప్రేమలో మరి సినిమాతో ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో ఈ సినిమా వీరి ముగ్గురికీ కీలకంగా మారిందిప్పుడు.