ఫోటో స్టొరీ: మహర్షి ని పరిశీలిస్తున్న సితార

Mon Feb 18 2019 22:20:15 GMT+0530 (IST)

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో ల్యాండ్ మార్క్ చిత్రమైన 'మహర్షి' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన విలేజ్ సెట్ లో జరుగుతోంది.  ఈ సినిమాకు అతిథుల తాకిడి జోరుగా ఉన్న సంగతి తెలిసిందే.  కొద్ది రోజుల క్రితం కన్నడ హీరో శ్రీమురళి.. సాయి కుమార్ మహేష్ ను కలిశారు. అదే రోజు తమిళ హీరో కార్తి కూడా మహేష్ ను కలవడం ప్రేక్షకులకు తెలిసిన విషయమే.ఈసారి కూడా మహర్షి గ్రామానికి అతిథులు వచ్చారు.  ఒకరిద్ధరు కాదు.. బోల్డంతమంది గెస్టులు.  మహేష్ వైఫ్ నమ్రత.. క్యూట్ డాటర్ సితార.. మహేష్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఉన్నారు.  మరో దర్శకుడు.. మహేష్ కుటుంబానికి సన్నిహితుడు అయిన మెహర్ రమేష్ కూడా ఈ ఫోటోలో ఉన్నారు. ఇక 'మహర్షి' దర్శకుడు వంశీ పైడిపల్లి.. మరొక వ్యక్తి ఈ అతిథులకు ల్యాప్ టాప్ లో 'మహర్షి' కి సంబంధించిన ఏదో సన్నివేశాన్ని చూపిస్తున్నారు.  ఈ ఫోటోలో అందరినీ ఆకర్షిస్తున్నది మాత్రం ఇద్దరు. ఒకరు గ్యాప్ లో నుంచి కెమెరా వైపు చూస్తున్న నమ్రత కాగా.. మరొకరు ల్యాప్ టాప్ స్క్రీన్ వంక తదేకంగా చూస్తున్న సూపర్ స్టార్ లిటిల్ డాటర్ సితార.  ఈ ఫోటోలో మిస్ అయింది మాత్రం మహేష్ తనయుడు గౌతమ్.

ఇక 'మహర్షి' సినిమా విషయానికి వస్తే ఏప్రిల్ 25 న విడుదల చేసేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో మహేష్ పాత్ర విభిన్న షేడ్స్ లో ఉంటుందనే విషయం ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది.