Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మినీ చెఫ్.. డాటర్ అఫ్ మహేష్

By:  Tupaki Desk   |   17 July 2019 8:43 AM GMT
ఫోటో స్టొరీ: మినీ చెఫ్.. డాటర్ అఫ్ మహేష్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రతల గారాలపట్టి సితార పాప సోషల్ మీడియాలో చాలా పాపులర్. అప్పుడప్పుడు మహేష్ లేదా నమ్రత సితారకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. దీంతో ఫ్యాన్స్ కే కాకుండా అందరు నెటిజన్లకు సితార పరిచయమే. సితార జులై 20 న పుట్టినరోజు జరుపుకుంటోంది. దీంతో నమ్రత బర్త్ డే వీక్ అంటూ సితార పాప ఫోటోలను రోజూ పోస్ట్ చేస్తున్నారు.

తాజాగా నమ్రత తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో సితార ఓ ప్రొఫెషనల్ బేకర్ తరహాలో సీరియస్ గా బేకింగ్ చేస్తూ ఉంది. ఈ ఫోటోకు "బేకింగ్ లో ఒక ఎక్స్ పర్ట్ లాగా చెయ్యేసినప్పుడు.. #2016 #బర్త్ డే వీక్.. #సితపాప టర్న్స్ సెవెన్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో పాతదే కానీ చాలా క్యూట్ గా ఉంది కదా? ఈ ఫోటోకు నెటిజన్లు లైకులతో హోరెత్తించారు. ఈ ఫోటోకు "చాకో పాప".. "మినీ చెఫ్".. "చిట్టితల్లి సో క్యూట్" అంటూ కామెంట్లు పెట్టారు.

ఈ ఫోటో నే కాదు నిన్న మరో ఫోటోను కూడా పోస్ట్ చేశారు నమ్రత. ఆ ఫోటోలో సితార పాప రోడ్డు మీద స్టైల్ గా నడుము మీద చేయిపెట్టుకుని నిలబడింది. మరో ఫోటోలో ఇంట్లో సోఫాలో కూర్చుని క్యూట్ పోజిచ్చింది.