Begin typing your search above and press return to search.

ఆడ-ఆడ లిప్‌ లాక్‌, మగ-మగ లిప్‌ లాక్‌

By:  Tupaki Desk   |   26 Aug 2015 1:52 AM GMT
ఆడ-ఆడ లిప్‌ లాక్‌, మగ-మగ లిప్‌ లాక్‌
X
ఒక అమ్మాయి, ఒక అబ్బాయి లిప్‌ లాక్‌ వేస్తే అది సహజం. కానీ ఒక అమ్మాయి మరో అమ్మాయితో పెదవి పెదవి పెనవేస్తే దానిని ఏమంటాం? ఒక అబ్బాయి మరో అబ్బాయితో పెదవి ముద్దులాడుకుంటే ఆ క్రియను ఏమని పిలుస్తాం? హోమో సెక్సువల్‌ అని పిలుస్తాం. ఈ హోమోల బెడద మనకంటే హాలీవుడ్‌ కే ఎక్కువ. ఏవైనా అవార్డు వేడుకలు, ఫంక్షన్ లు జరిగేప్పుడు చాలా క్యాజువల్‌ గా ఆన్‌ స్టేజ్‌ పెదవి పెదవి కలిపేసుకుని సర్‌ ప్రైజ్‌ ఇస్తుంటారు. అలాంటి సర్‌ ప్రైజులు ఇచ్చిన జాబితా పరిశీలిస్తే కొన్ని పాపులర్‌ పేర్లివి...

కనాన్‌ ఓ బ్రెయిన్‌, ప్యాట్రిక్‌ స్టివార్ట్‌ (మగ -మగ) ఇద్దరూ మగాళ్లే. ప్యాట్రిక్‌, టీవీ స్టార్‌ ఓ బ్రెయిన్‌ తో లిప్‌ లాక్‌ లాగించేసిన తీరు ఇటీవలి కాలంలో చర్చల్లో కొచ్చింది. అదే తరహాలో మెరిల్‌ స్ట్రీప్‌ ఓ పబ్లిక్‌ ఫంక్షన్‌ లో శాండ్రా బుల్లక్‌ తో పెదవి పెదవి కలిపేయడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. పాప్‌ స్టార్‌ మడోన్నా అయితే ఇప్పటికి రెండుసార్లు ఇలాంటి పనిచేసింది. పాప్‌ గాయని బ్రిట్నీ స్పియర్స్‌ ని మడోన్నా (ఆడ -ఆడ) ఓ రెడ్‌ కార్పెట్‌ వేడుక లో పెదవి ముద్దులాడేసింది. క్రిస్టినా అగులెరా అండ్‌ మడోన్నా (ఆడ -ఆడ) మధ్య కూడా ఇలాంటిదే జరిగింది. రాచెల్‌ - ర్యాన్‌ గోస్లింగ్‌ ముద్దు భోగోతం అప్పట్లో పెను సంచలనమైంది.

పాపులర్‌ హాలీవుడ్‌ స్టార్‌ శాండ్రా బుల్లక్‌ - నటి స్కార్లెట్‌ జాన్సన్‌ (ఆడ -ఆడ) ని పెదవి ముద్దుల్లో ముంచేసి సెన్షేషన్‌ కి కారణమైంది. ఇక మడోనా - తన బోయ్‌ ఫ్రెండ్‌ డ్రేక్‌ ని చాలా సార్లు పబ్లిక్‌ వేదికలపై ముద్దులాడేసింది. ఇలాంటివి మనకి కొత్త కానీ, హాలీవుడ్‌ కి కానేకాదు.