Begin typing your search above and press return to search.

విదేశీ టూర్ల‌తో సింగ‌ర్ల భారీ ఆర్జ‌న‌!

By:  Tupaki Desk   |   20 May 2019 5:30 PM GMT
విదేశీ టూర్ల‌తో సింగ‌ర్ల భారీ ఆర్జ‌న‌!
X
పాడుతా తీయ‌గా.. బోల్ బేబి బోల్.. సూప‌ర్ సింగ‌ర్స్.. స‌రిగ‌మ‌ప (తెలుగు- హిందీ) .. పాడేందుకు వేదిక ఏదైనా చ‌క్క‌ని ప్ర‌తిభ‌ను వెలికి తీసిన కార్య‌క్ర‌మాలివి. ఇలాంటి ఎన్నో బుల్లితెర కార్య‌క్ర‌మాలు బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని సింగింగ్ ట్యాలెంట్ ని బ‌య‌ట‌పెడుతూ వారికి అవ‌కాశాలు - ఉపాధిని క‌ల్పించ‌డం హ‌ర్షించ‌ద‌గిన‌ది. వీటి నుంచి ఎంద‌రో ట్యాలెంటుకు పాడే అవ‌కాశాలు క‌ల్పించిన‌ మ‌న మ్యూజిక్ డైరెక్ట‌ర్లు దేవుళ్ల‌తో స‌మానం.

నేటిత‌రం గాయ‌నీగాయ‌కుల‌ సంపాదన ఎలా ఉంటుంది? అంటే ఒక్కొక్క‌రి రేంజ్ ఒక్కోలా ఉంటుంది. డిమాండ్ ని బ‌ట్టి పారితోషికాలు ఉంటున్నాయి. ఉపాధి స‌రిప‌డా ఉంటుందా? అంటే ఇక్క‌డా వెతుక్కునేవాళ్ల‌కు బోలెడ‌న్ని కార్య‌క్ర‌మాల‌తో ఉపాధి దొరుకుతోంది. ఓవైపు ఆదుకునేందుకు పెద్ద తెర‌తో పాటు.. బుల్లితెర షోలు.. కార్య‌క్ర‌మాలు చాలానే ఉన్నాయి. ప్ర‌తిచోటా సింగింగ్ ట్యాలెంట్ కి అవ‌కాశాలు క‌ల్పించే ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేస్తున్నారు. సినిమాల‌కు పాడుతూనే .. ఇత‌ర మార్గాల్లో బుల్లితెర కార్య‌క్ర‌మాల‌తో ఆర్జించే అవ‌కాశం క‌లుగుతోంది. యంగ్ ట్యాలెంటెడ్ సింగ‌ర్ల‌కు ఇప్పుడు అవ‌కాశాలు పెరిగాయి. ఉర్రూత‌లూగించే స‌త్తా మీలో ఉంటే విదేశాల‌కు విమానం టిక్కెట్లు ఫ్రీ. అమెరికా.. కెన‌డా.. బ్రిట‌న్.. దుబాయ్ కాదేదీ కాన్సెర్టుల‌క‌న‌ర్హం. తెలుగు ట్యాలెంట్ ఉన్న ప్ర‌తి విదేశం ఉపాధినిచ్చేదే.

ఇక మ‌న టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లంతా విదేశాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు కాన్సెర్టులు.. మ్యూజిక్ షోలు పేరుతో భారీ టూర్లు ప్లాన్ చేస్తున్నారు. అమెరికా- బ్రిట‌న్- దుబాయ్- సింగ‌పూర్ స‌హా విదేశాల్లో టూర్ లు ప్లాన్ చేస్తూ యంగ్ సింగ‌ర్స్ కి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. అస‌లు న‌వ‌త‌రం గాయ‌నీగాయ‌కులు విదేశీ కాన్సెర్టుల‌కు వెళితే ఎంత ఆర్జించ‌వ‌చ్చు? అంటే బ‌య‌ట‌కు చెప్ప‌రు కానీ.. వీళ్ల రేంజు.. ఒక్కో విదేశీ ట్రిప్ ల‌కు రూ.2ల‌క్ష‌ల నుంచి 5ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుందట‌. టాప్ రేంజు కు రూ.5ల‌క్ష‌ల నుంచి 10ల‌క్ష‌లు..(విమానం టిక్కెట్లు.. తిండి-బ‌స సౌక‌ర్యాలు అద‌నం) రేంజును బ‌ట్టి ప్యాకేజీ ఉంటుంద‌ని ఓ ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ డీటెయిల్స్ అందించారు.

ఇదివ‌ర‌కూ ఇళ‌య‌రాజా లైవ్ కాన్సెర్ట్ పేరుతో భారీ టూర్ స‌క్సెసైంది. గాన‌గంధ‌ర్వుడు బాల‌సుబ్ర‌మ‌ణ్యం, సంగీత ద‌ర్శ‌కుడు.. మెలోడీ బ్ర‌హ్మ‌ మ‌ణిశ‌ర్మ‌.. సుస్వ‌రాల కీ.శే.చ‌క్రి సైతం ఈ త‌ర‌హా భారీ కార్య‌క్ర‌మాల్ని పెద్ద స‌క్సెస్ చేశారు. వాటితో గాయ‌నీగాయ‌కులకు బోలెడంత ఉపాధి ల‌భించింది. ప్ర‌స్తుతం మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి.. మిక్కీ .జె.మేయ‌ర్ వంటి సంగీత ద‌ర్శ‌కులు విదేశీ కాన్సెర్టుల‌కు ప్లాన్ చేశారు. ఎంఎం కీర‌వాణి అమెరికా బే ఏరియా శాన్ జోస్ సెంట‌ర్ లో జూన్ 1న లైవ్ కాన్సెర్టుని ప్లాన్ చేశారు. జూన్ 1, జూన్‌ 22, జూన్ 23 తేదీల్లో బే ఏరియాలో కాన్సెర్టులు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే సులేఖ స‌హా ఆన్ లైన్ లో టిక్కెట్ల సేల్ జ‌రుగుతోంది. మ‌రోవైపు మిక్కీ.జె.మేయ‌ర్ లైవ్ కాన్సెర్టు ఉత్త‌ర అమెరికాలో జ‌ర‌గ‌నుంది. మిక్కీ.జె తొలి కాన్సెర్టు కోసం మెజెస్టిక్ సిటీ నేష‌న‌ల్ సివిక్ సెంట‌ర్ (శాన్ జోస్)లో లైవ్ షో కోసం జూన్ 29వ‌ తేదీని లాక్ చేశారు. ర‌మ్య బెహ‌రా, అంజ‌నా సౌమ్య స‌హా టాప్ సింగ‌ర్లు ఈ ఈవెంట్ లో ఆల‌పించ‌నున్నారు. ఇక ఇలాంటి ఈవెంట్ల‌లో గీతా మాధురి.. సునీత రేంజు సింగ‌ర్లు అయితే భారీ మొత్తాల్ని అందుకుంటున్నారు. ర‌న్నింగ్ స‌క్సెస్ ని బ‌ట్టి సింగర్ల‌కు ప్ర‌తిదానికి ఇంత అని పారితోషికం ఉంటుంది. ఇటీవ‌ల సింగ‌ర్లు.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ల ను కాపీ రైట్ యాక్ట్ ప‌రిధిలోకి తెచ్చారు కాబ‌ట్టి మ‌రింత క్లియ‌ర్ క‌ట్ గా డిమాండ్ కి ఆస్కారం ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది.