ఔను.. ఆమెను లైంగికంగా వేదించాను

Thu Oct 11 2018 15:43:20 GMT+0530 (IST)

తనూశ్రీ దత్తా లైంగిక వేదింపుల ఆరోపణలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. నానా పటేకర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఆమె ఇచ్చిన ధైర్యంతో ఎంతో మంది మీటూ అంటూ మీడియా ముందుకు వచ్చి తమకు ఎదురైన లైంగిక ఆరోపణల అనుభవాలను తెలియజేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం సంఘటనలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తాజాగా సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి పలు సంచలన విషయాలను బయట పెట్టిన విషయం తెల్సిందే.తనపై లైంగిక ఆరోపణలు జరిగాయని చెబుతూనే తన సన్నిహితురాలు - తోటి సింగర్ పై కూడా లైంగిక దాడి జరిగిందని చిన్మయి చెప్పుకొచ్చింది. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రఘు దీక్షిత్ తనను ఒకసారి ఇంటికి రమ్మని పిలిచాడని - తన స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఆరోపణలు చేసింది. రఘు దీక్షిత్ గురించి చిన్మయి చేసిన వ్యాఖ్యలు కన్నడ సినీ రంగంలో సంచలనం సృష్టించాయి. చిన్మయి వ్యాఖ్యలపై వెంటనే రఘు దీక్షిత్ స్పందించాడు.

చిన్మయి చెప్పింది నిజమే అని - పాట రికార్డింగ్ సమయంలో ఉద్వేగానికి లోనైన తాను ఆమెను హగ్ చేసుకున్నాను ఆమెను ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాను. కాని ఆమె అందుకు ఒప్పుకోక పోవడం వెంటనే వెనక్కు తగ్గాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలోనే ఆమెకు సారీ చెప్పాను - ఇప్పుడు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను. ఆ సమయంలో నా భార్య నాతో ఉండటం లేదు ఇప్పుడు కూడా నా భర్య నాతో లేదు. నా భార్యకు కూడా ఈ సమయంలో క్షమాపణలు చెబుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశాడు. చిన్మయిని ఇంటికి పిలిచినట్లుగా వచ్చిన ఆరోపణలపై మాత్రం రఘు దీక్షిత్ మౌనం వహించాడు. చిన్మయి చేసిన ఆరోపణలు నిజమా లేదా అనేది ఆయన వెల్లడించలేదు.