చచ్చేలా కొట్టాడంటూ ఫేమస్ సింగర్ రివీల్

Sun Feb 18 2018 10:57:49 GMT+0530 (IST)

ఆమె గొంతు వెంట జాలువారే పాటతో మైమరిచిపోతారెందురో. ఆమె కంఠానికి దాసులైనోళ్లు కోట్లాదిమంది ఉంటారు. ఆమె పాటల్ని వింటూ స్టెస్ రిలీజ్ అయ్యే వారెందరో. తన పాటతో ఎందరినో ప్లాట్ చేసిన సింగర్ కౌసల్య. ఆమె పాడిన పాటలెన్నో సూపర్ హిట్. కానీ.. ఆమె దాంపత్య జీవనం గురించి తెలిస్తే షాకే. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె.. తన వైవాహిక జీవితంలో తనకెదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టారు.నోట మాట రాని రీతిలో.. షాకింగ్ గా అనిపించే ఆమె గతం గురించి విన్నంతనే అయ్యో అనకుండా ఉండలేం. అనుమానంతో ఇష్టారాజ్యంగా మాట్లాడటమే కాదు.. చచ్చేటట్లు కొట్టిన వైనం ఆమె చెబుతుంటే కంట నీరు ఆగదంతే. ఆమె గతాన్ని రివీల్ చేసి సంచలనం సృష్టించారు. తాను సెలబ్రిటీగా ఎప్పుడు ఫీల్ కాలేదని.. సింగర్ గా ఉంటూనే.. ఇంట్లో అన్ని పనులు తానే చేసుకునేదానినని చెప్పుకొచ్చారు.

సంచలనం.. అంతకు మించిన షాకింగ్ గా ఉన్న ఆమె గతం గురించి ఒక ప్రముఖ పత్రికతో పంచుకున్నారు. అందులో కొన్ని అంశాలు యథాతధంగా చూస్తే..

పెళ్లంటే అందరి అమ్మాయిల్లాగే నేనూ ఎన్నో కలలు కన్నాను. ఒక కొత్త జీవితాన్ని ఊహించి ఆ ఇంట్లో అడుగుపెట్టాను. అన్ని విధాలా నన్ను చూసుకునే ప్రేమించే వ్యక్తి ఉన్నాడనే భరోసాతో వెళ్లాను. కానీ పెళ్లయిన పదహారో రోజే  అత్తారింట్లో అందరిముందు కొట్టాడు. పెళ్లిలో మా అమ్మ మర్యాదలు సరిగా చేయలేదని.  నేను టెన్త్‌క్లాస్‌లో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు హఠాత్తుగా. ఏజీ ఆఫీస్‌లో పనిచేసేవారు. మేం ముగ్గురం పిల్లలం. నాకు ఒక చెల్లి తమ్ముడు.  అమ్మే కష్టపడి పెంచింది మమ్మల్ని.

‘‘మా అమ్మను ఒక్క మాట కూడా అనొద్దు’’ అని నేను అన్నందుకు నన్ను కొట్టాడు. దవడ ఇప్పటికీ నొప్పిగానే ఉంటుంది. ఆరోజే అనుకున్నాను ఇంక  ఇది వద్దు అని. అయితే విడాకులు తీసుకొని ఇంటికెళితే అమ్మకు ఎంత కష్టం? పెళ్లి కావల్సిన చెల్లి ఉంది. సొసైటీ ఏమనుకుంటుంది? అనే ఆలోచన వెనక్కిలాగింది.

‘‘లేదు ఇంకోసారి ఈ మిస్టేక్ జరగదు. ఇది నాకు కావాలి’’ అని తను అన్నాడు. క్షమించాను.  కాని అది  క్లోజ్ కాలేదు. అతను చెయ్యి ఎత్తుతూనే వచ్చాడు.  ఒకసారి మా అత్తగారితో కూడా షేర్ చేసుకున్నా.  ‘‘మన ఇళ్లల్లో కొత్తేం కాదు ఇది.. నువ్వే కొంచెం చూసీ చూడనట్టు పో’’ అని చెప్పారు ఆమె. చూసీచూడనట్టూ వెళ్లా.  తర్వాత నాకు తెలిసిందేంటంటే.. అతను ఇంకో అమ్మాయితో ఉన్నాడు.. వాళ్లకు సంతానం కూడా ఉందని.

మా నాన్నే కొట్టలేదెప్పుడూ నన్ను. సింగింగ్‌తో  చదువులో బీగ్రేడ్ వచ్చిన రోజూ పల్లెత్తు మాటనలేదు.  ‘‘బాధపడకురా.. నీకు చాలా స్ట్రెన్త్ ఉంది’’ అంటూ ఎంకరేజ్ చేయడం తప్ప.  సింపుల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం ఆయనకు ఇష్టం.  అలాగే పెంచాడు. నిజానికి మా మామగారు మా నాన్న ఇద్దరూ కొలీగ్స్. చిన్నప్పటి నుంచీ చూసినవాళ్లే. పాడడం నచ్చే నన్ను చేసుకున్నాడు అతను (భర్త). ఫస్ట్‌లో చాలా ఎంకరేజ్  చేశాడు కూడా.

అలాంటిది ఒక్కసారిగా ‘‘నీ ఫొటోలు చూడు ఎట్లా ఉన్నాయో? నీ బిహేవియర్ చూడు ఎట్లా ఉందో? నీకు ఎవడో ఉన్నడంట కదా..’’ అంటూ మొదలుపెట్టాడు. సామరస్యంగా మాట్లాడదామని ట్రై చేసినా సాగనిచ్చేవాడు కాదు. కొట్టడమే. ఆయన ఇంటికొస్తున్నాడంటనే దడ వచ్చేది.\

సూపర్ సింగర్ 7 నాకు పెద్ద చాలెంజ్. అప్పుడే అమ్మకు క్యాన్సర్ ఆయన గొడవలు స్టార్ట్ చేయడం అన్నీ ఒకేసారి. చాలా కుంగిపోయా. ఎందుకంటే ఆమే నాకు సపోర్ట్. బాధ తొలిచేసేది. ఒకసారి మా బావగారు అంటే ఆయన పెద్దనాన్న కొడుకు వాళ్లు వచ్చారు ఇంటికి మా సమస్యను  పరిష్కరిద్దామని. వాళ్లందరి ముందూ కొట్టాడు రక్తంకారేలా. వాళ్లు ఆయన్ని ఆపకపోతే నేను చచ్చిపోయేదాన్ని ఆ రోజు. మా బాబుకి అప్పుడు ఆరేళ్లు. ‘అమ్మను కొట్టొద్దు నాన్నా. ప్లీజ్ కొట్టొద్దు నాన్నా’ అంటూ వాళ్ల నాన్న కాళ్లు పట్టుకున్నాడు.

నా దగ్గరకు వచ్చి ‘అమ్మా కొట్టుకోకండి అమ్మా... కలిసి ఉండండి అమ్మా..’ అని వాడు ఏడుస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. నా తలంతా గాయాలే. మా బావగారు వాళ్లే ఐస్‌క్యూబ్స్ ఇచ్చి ‘‘వెళ్లి అమ్మాయికి పెట్టరా’’ అన్నారు.

మాట్లాడ్డానికి కూడా ట్రై చేయక మళ్లీ పోలీసుల దగ్గరకు వెళ్లా. ‘‘కేసులేమీ లేకుండా ఒకసారి ఆయనను పిలిచి మాట్లాడండి’’ అని రిక్వెస్ట్ చేశా. కంప్లయింట్లు ఇచ్చి పదిమందికీ తెలిసి అల్లరి కాకుండా లోపలే పరిస్థితి చక్కదిద్దుకుందామనే నా ప్రయత్నం అప్పటికీ.  అందుకే ఆయన మీద డొమెస్టిక్ వయలెన్స్ కేసు వేయాలనే ఆలోచన కూడా రాలేదు. కాని  ఇప్పుడనిపిస్తోంది. అప్పుడే ఆ పని చేసుండాల్సింది అని. ఆయనతో ఉన్న ఆమె పేరు బయటపెడితే చంపేస్తామని బెదిరించారు ఇద్దరూ. భయపడి అప్పుడు  కేస్ ఫైల్ చేశాను.

కొట్టినా తిట్టినా పడ్డాను. సెలబ్రెటీగా నేనెప్పుడూ బతకలేదు. ఇంట్లో అన్ని పనులు చేసే రికార్డింగ్‌కి వెళ్లేదాన్ని. ఆయన స్నేహితులొస్తే వండిపెట్టేదాన్ని.  అత్తింట్లో అందరికీ మర్యాద ఇచ్చాను. నా కొడుకు వ్యాక్సినేషన్ దగ్గర్నుంచి స్కూల్లో చేర్పించేదాకా అన్నీ నేనే చూసుకున్నా ఇండిపెండెంట్‌గా.  ఎక్కడా ఏ లోపం చేయలేదే? ఎందుకు నన్ను ఇంత మోసం చేయడం?  ఇప్పుడు నా జీవితం నేను జీవిస్తున్నా.

నేను ఇంత బలంగా.. సంతోషంగా.. నవ్వుతున్నానంటే కారణం నా కొడుకే. నేను నా కొడుకు మీద పెడుతున్న శ్రధ్ధను చూసి వాళ్ల నాన్నే జెలసీ ఫీలయ్యి  ‘‘నువ్వు నీ కొడుకును పెంచినట్టు మా అమ్మ నన్ను పెంచి ఉంటే నేనిట్లా తయారయ్యేవాడిని కాను’’ అని అంటుండేవాడు.  నాకున్న గొడవల్లో నాకు వచ్చిందాన్ని మరిచిపోకుండా ఉండడానికే సంగీత అకాడమీ. అదే  నా ఆత్మసంతృప్తి. పాడడంలోనే నాకు  మనశ్శాంతి.