Begin typing your search above and press return to search.

ఆర్పి స్టైల్ లోనే అనిరుధ్ కూడా

By:  Tupaki Desk   |   15 Feb 2019 7:38 AM GMT
ఆర్పి స్టైల్ లోనే అనిరుధ్ కూడా
X
సరిగ్గా 20 ఏళ్ళ క్రితం సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన ఆర్పి పట్నాయక్ అప్పట్లో ఓ సంగీత సంచలనం. ముఖ్యంగా తేజ దర్శకత్వంలో ఇతను అందించిన ట్యూన్స్ ఊరువాడా హోరెత్తిపోయాయి. నువ్వు నేను-జయం-చిత్రం-మనసంతా నువ్వే లాంటి ఆల్బమ్స్ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ఎవర్ గ్రీన్ లిస్ట్ లో ఉంటాయి. అయితే తనకో బలం ప్లస్ బలహీనత ఉంది. అదే తన స్వంత గాత్రంలో సాధ్యమైనన్ని ఎక్కువ పాటలు పాడాలనే కాన్సెప్ట్. ఒకరకంగా చెప్పాలంటే అది కొంత మేర అతని కెరీర్ మీద ప్రభావం చూపించింది.

అన్ని పాటలు ఒకేలా ఉన్నాయన్న ఫీలింగ్ కలగడంతో ప్రేక్షకుల ఆదరణ తగ్గింది. పదేళ్లు తిరక్కుండానే అవకాశాలు తగ్గిపోయాయి. అయినా కూడా అభిరుచి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా ఆర్పి కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటున్నారా. తమిళ్ లో అనిరుద్ రవిచందర్ ఎంత టాప్ పొజిషన్ లో ఉన్న తెలుగులో వేస్తున్నవి బుడిబుడి అడుగులే. గత ఏడాది పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో పరిచయమైన అనిరుద్ ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవ చేయాల్సింది కానీ ఎందుకో వదులుకున్నాడు. ఇప్పుడు నాని జెర్సీతో మరోసారి పలకరిస్తున్నాడు అనిరుద్.

నిన్న అదేంటో గాని ఉన్నపాటుగా అనే లిరికల్ వీడియో విడుదల చేసారు. ముందు పర్వాలేదు అనిపించినా అనిరుద్ స్వంత గాత్రంతో పాటు ట్యూన్ రెగ్యులర్ గానే అనిపించడంతో ఫ్యాన్స్ కి అంత కిక్ ఇవ్వడం లేదేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైరల్ అయ్యే రేంజ్ లో ఇది లేదని టాక్ వచ్చేసింది. దీనికి కారణం ఒకే టోన్ లో పాటలు కంపోజ్ చేసుకోవడమా లేక అన్ని తనే పాడాలన్న తాపత్రయమా అనిరుద్ ఓసారి విశ్లేషించుకుంటే బెటరేమో. ఒక్క పాటకే కాదు కాని పూర్తి ఆల్బమ్ విన్నాక దీని గురించి మరింత స్పష్టత వస్తుంది. చూద్దాం