Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ తో ఇక వాళ్లేనా?

By:  Tupaki Desk   |   24 May 2018 6:11 AM GMT
సూపర్ స్టార్ తో ఇక వాళ్లేనా?
X
ప్రస్తుతం సీనియర్ హీరోలు కమర్షియల్ కథల్లోనే కొత్తదనాన్ని చూపిస్తున్నారు. ఏజిడ్ పర్సన్స్ లా కనిపించి సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి సినిమా నుంచి చాలా డిఫరెంట్ స్టైల్ లో కనిపిస్తున్నారు. యువ దర్శకులు చెప్పిన కథలకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చూస్తుంటే ఆయన ఏ తరహాలో ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక హీరోయిన్స్ విషయంలో సీనియర్ హీరోలకు ఈ మధ్య ఇబ్బందిగా మారింది.

యువ హీరోయిన్స్ ఏ మాత్రం సెట్ అవ్వకపోయినా కూడా బావుండదు అని ఆలోచిస్తూ వారికి సెట్ అయ్యే వారినే ఎంపిక చేసుకుంటున్నారు. ఇక రజినీకాంత్ అయితే పెళ్లయిన హీరోయిన్స్ ని కథలో భాగంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. కబాలి సినిమాలో రాధిక ఆప్టే నటించిన సంగతి తెలిసిందే. ఇక కాలా సినిమాలో హుమా ఖురేషి పెద్దగా యువ హీరోయిన్ ఏమి కాదు. ఆమె రజిని ఏజ్ కి సెట్ అయ్యే పాత్రలోనే కనిపించనున్నారు. ఇక నెక్స్ట్ పిజ్జా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ ఓ సినిమాకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

రజినీ అల్లుడు ధనుష్ ఆ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ కథలో కూడా సూపర్ స్టార్ పాత్ర మిడిల్ ఏజ్ కి సంబంధించినది కావడంతో మరో సీనియర్ నటిని లైన్ లో పెట్టారు. పెళ్లయిన సిమ్రాన్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ సినిమాకు పెట్టె బడ్జెట్ లలో ఇప్పుడు హీరోయిన్ ల విషయంలో నిర్మాతలకు కలిసివచ్చే విషయమనే చెప్పాలి. ఇక 2.0 సినిమా భారీ బడ్జెట్ తో కూడిన సినిమా కావున అమీ జాక్సన్ ను శంకర్ సెలెక్ట్ చేసుకున్నాడు.