నెగిటివే రోల్ లో కలల రాణి

Mon Jun 19 2017 19:59:19 GMT+0530 (IST)

మిలీనియం మొదటిలో అంటే 2000 సంవత్సరం లో అందరి కలల రాణి.. సిమ్రాన్. ఇప్పుడు మళ్ళీ తన నటనతో అందరినీ అలరించనుంది. పూర్తిగా నటనకు స్వస్తి పలకకపోయిన ఇప్పుడు చేస్తున్న సినిమాలు తక్కువనే చెప్పాలి. అయితే త్వరలో ఒక నెగిటివ్ పాత్రలో మనముందుకు రానుంది. తమిళ్ డైరెక్టర్ పొణరామ్ డైరెక్ట్ చేస్తున్న హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమాలో ఒక కీలక పాత్ర లో నటించబోతుంది అని తమిళ్ వర్గాలు చెబుతున్నాయి.

సిమ్రాన్ తన ఇన్నేళ్ళ కెరియర్లో మొదటిసారి నెగిటివ్ పాత్రలో నటిస్తోంది. ఈమెకు జోడీగా మలయాళం నటుడు లాల్ నటించబోతున్నాడు. ఈ పాత్ర కోసం తమిళ్ మార్టియల్ ఆర్ట్ సీలంబమ్(కర్ర సాము) కూడా నేర్చుకుంటోందట ఈ సీనియర్ స్టార్. శివ కార్తికేయన్ నాన్నగా మరో దక్షణ నటుడు నెపోలియన్ చేస్తున్నారు. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో హీరోయిన్ అవ్వడం మరింత ఆశక్తిగా మారింది. శివ కార్తికేయన్ సినిమాలు అన్నీ కామెడీ సినిమాలే ఈ సినిమాలో కూడా కామిడీ కోసం తమిళ్ నటుడు సూరి ని తీసుకునట్లు తెలుస్తోంది. అయితే సిమ్రాన్ పండించే విలనీ అన్నింటికంటే హైలైట్ అవ్వబోతోందట.

24 AM స్టూడియో ఆర్ డి రాజ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డి ఇమ్మన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో చాలా విఎఫ్‌ఎక్స్ షాట్ ఉంటాయట. అందుకోసం ‘పులి’ ‘బాహుబలి 2’ కు పని చేసిన ఆర్‌సి కమలకన్నన్ పని చేస్తున్నారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/