Begin typing your search above and press return to search.

శింబు-నయన్.. ఎట్టకేలకు దిగుతున్నారబ్బా

By:  Tupaki Desk   |   24 May 2016 1:30 PM GMT
శింబు-నయన్.. ఎట్టకేలకు దిగుతున్నారబ్బా
X
కోలీవుడ్ కాంట్రవర్సల్ హీరో శింబు ప్రతి సినిమాకూ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ‘వాలు’ సినిమా కోసం రెండేళ్లకు పైగా ఎదురు చూసి విసిగిపోయిన అభిమానులకు గత ఏడాదే దర్శనం దొరికింది. ఇక ‘ఇదు నమ్మ ఆలు’ సినిమా కోసం సాగుతున్న నిరీక్షణ ఎట్టకేలకు ఫలిస్తోంది. ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల రాబోతోంది. అనేక వివాదాలకు కేంద్రంగా నిలిచిన ఈ రెండు సినిమాల్లో శింబు మాజీ గర్ల్ ఫ్రెండ్స్ హీరోయిన్లుగా నటించడం విశేషం. ‘వాలు’లో హన్సిక హీరోయిన్ అయితే.. ‘ఇదు నమ్మ ఆలు’లో నయనతార శింబుకు జోడీగా నటించింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శింబు తండ్రి టి.రాజేందరే నిర్మించాడు. శింబు తమ్ముడు కురాలరసన్ సంగీతం అందించాడు.

డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్లతో శింబు ఫ్యామిలీకి ఉన్న గొడవల పుణ్యమా అని అతడి ప్రతి సినిమాకూ అడ్డంకులు ఎదురవుతున్నాయి. టీజర్.. ట్రైలర్లతో అత్యంత ఆసక్తి రేపిన ‘ఇదు నమ్మ ఆలు’ కూడా ఏడాది నుంచి విడుదల కోసం ఎదురు చూస్తోంది. కనీసం పది సార్లయినా వాయిదా పడిన ఈ సినిమా కోసం శింబు ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్లో శింబు-నయన్ కెమిస్ట్రీ చూసి జనాలకు మతిపోయింది.

ముఖ్యంగా.. ‘‘ఏరా మీకు అమ్మాయిల్ని ప్రేమించడం తప్ప వేరే పని లేదా’’ అని నయన్ అంటే.. ‘‘ముందు మీరు ఆపండి. తర్వాత మేం ఆపుతాం’’ అంటూ శింబు రిటార్ట్ ఇచ్చే సీన్ వాళ్లిద్దరి నిజ జీవితాల్ని ప్రతిబింబించేలా ఉండటం జనాల్లో క్యూరియాసిటీని మరింత పెంచింది. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు మరిన్ని ఉంటాయని శింబు అంటున్నాడు. ఆండ్రియా మరో కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు తమిళంలో మంచి రెస్పాన్స్ వస్తే తెలుగులోనూ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.