Begin typing your search above and press return to search.

ప్రకంపనలు రేపుతున్న శింబు-నయన్

By:  Tupaki Desk   |   30 May 2016 6:59 AM GMT
ప్రకంపనలు రేపుతున్న శింబు-నయన్
X
మామూలుగా ఏళ్లకు ఏళ్లు వాయిదా పడి.. అతి కష్టం మీద రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తుంటాయి. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఈ ‘వాయిదా’ సినిమాల వరస ఇలాగే ఉంటుంది. కానీ శింబు-నయనతార కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇదు నమ్మ ఆలు’ మాత్రం సంప్రదాయాన్ని మారుస్తోంది. ఎప్పుడో మూడేళ్ల ముందు మొదలై.. రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం.. పోయిన శుక్రవారమే విడుదలై సెన్సేషనల్ హిట్టయిపోయింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సెన్సిబుల్ లవ్ స్టోరీలో శింబు-నయన్ ల కెమిస్ట్రీనే హైలైట్‌ గా నిలుస్తోంది.

ముందో అమ్మాయిని ప్రేమించి.. ఆ తర్వాత ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునే కుర్రాడి కథ ఇది. శింబు.. నయన్ ల క్యారెక్టర్లు వాళ్ల నిజ జీవితానికి అద్దం పట్టేలా ఉంటాయి. రియల్ లైఫ్ ను గుర్తుకు తెచ్చే సరదా డైలాగులు కూడా పెట్టారు సినిమాలో. ‘‘అందరూ లవ్ స్టోరీని చూసి నవ్వుకుంటున్నారు’’ అని శింబు చెప్పే డైలాగ్.. ‘‘ఇంకా ఎంతమందిని లవ్ చేస్తావురా’’ అని నయన్ అంటే.. ‘‘ముందు మీరు ఆపండి తర్వాత మేం ఆపుతాం’’ అంటూ శింబు రిటార్ట్ ఇచ్చే డైలాగ్.. ఇలాంటివన్నీ ప్రేక్షకుల్ని భలే ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.14 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. వీకెండ్ మొత్తంలోనూ భారీ వసూళ్లు వచ్చాయి. శింబు కెరీర్లోనో ఇదే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి. బ్లాక్ బస్టర్ ‘మన్మథన్’ వసూళ్లను ఇది దాటేసేలా ఉంది. ఆండ్రియా మరో కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.