Begin typing your search above and press return to search.

క్వీన్ లో గుంటూరు టాకీసోడు

By:  Tupaki Desk   |   21 Oct 2017 10:44 AM GMT
క్వీన్ లో గుంటూరు టాకీసోడు
X
బాలీవుడ్ లో కంగనా రనౌత్ లీడ్ రోల్ లో నటించిన క్వీన్ చిత్రం బాక్స్ ఆఫీస్ కి కొత్త పాఠాలు నేర్పింది. అయితే ఇప్పుడు అదే తరహాలో సౌత్ ఇండస్త్రీలకు కూడా సరికొత్త పాఠాలని నేర్పాలని మన హీరోయిన్లు తెగ ట్రై చేస్తున్నారు. టాలీవుడ్ లో ఈ సినిమాను మిల్కి బ్యూటీ చేస్తోన్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ లో 100 కోట్లు కొల్లగొట్టిన క్వీన్ సినిమా రీమేక్ మినిమం వసూళ్లను రాబట్టగలదు అనే నమ్మకంతో తీస్తున్నారు. షో - మిస్సమ్మ మరియు విరోధి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నీలకంఠ.. రీమేక్ క్వీన్ ను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోగా సిద్దు జొన్నలగడ్డ ని సెలక్ట్ చేశారు. గుంటూరు టాకీస్ వంటి సినిమాల్లో నటించి పర్వాలేదనిపించిన సిద్దు చాలా రోజుల తర్వాత మళ్లీ మరో మంచి అవకాశాన్ని దక్కించుకున్నాడు. రాజ్ కుమార్ రావ్ క్వీన్ హిందీ సినిమాలో హీరోగా నటించి మెప్పించిన ఆ పాత్రను సిద్దు ఏ విధంగా చేస్తాడో చూడాలి.

ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 1న సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక మొదటి షెడ్యూల్ ఫ్రాన్స్ లో ప్రారంభం అవుతుంది. మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగులో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.