Begin typing your search above and press return to search.

అబ్బో.. లిప్ కిస్ పెట్టేశాడుగా...

By:  Tupaki Desk   |   17 Oct 2017 4:38 AM GMT
అబ్బో.. లిప్ కిస్ పెట్టేశాడుగా...
X
తెలుగులో రొటీన్ సినిమాల నుంచి ప్రయోగాత్మక సినిమాల వరకు అన్ని రకాలూ ట్రై చేసినా బొమ్మరిల్లు లాంటి సక్సెస్ మళ్లీ సిద్ధార్ధకు దక్కలేదు. కనీసం యావరేజ్ గా కూడా తన సినిమాలు ఆడకపోవడంతో నెమ్మదిగా కోలీవుడ్ వైపు దృష్టి పెట్టాడు. అక్కడ సినిమాలు తీస్తూ ఇక్కడ డబ్బింగ్ చేస్తున్నాడు.

తాజాగా సిద్ధార్ధ గృహం అనే హర్రర్ పిక్చర్ లో నటిస్తున్నాడు. తడాఖా సినిమాలో సునీల్ కు పెయిర్ గా కనిపించిన ఆండ్రియా జెర్మియా ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇందులో సిద్ధార్ద్ - ఆండ్రియాల మధ్య రొమాంటిక్ సీన్లతో ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో సిద్ధార్ధ్ ఆండ్రియాకు మధ్య గాఢమైన లిప్ కిస్ ఇచ్చాడు. అదేదో ఒక్కసారి కాదు.. మూడు నిమిషాల పాట స్టార్టింగ్ నుంచి ఎండయ్యేలోపు అర డజను సార్లు ఈ జంట అధర చుంబనంలో మునిగి తేలింది. ఈ మధ్య తెలుగులో హిట్టయిన అర్జున్ రెడ్డి మూవీ తరహాలో లిప్ లాక్ లతో బాగానే బజ్ క్రియేట్ చేశారు.

తొలిసారి జంటగా కనిపిస్తున్న సిద్ధార్ధ్ - ఆండ్రియాల కెమిస్ట్రీ కరెక్ట్ గా సెట్ కావడం.. పాట చిత్రీకరణ - మ్యూజిక్ బాగుండటం.. బాలీవుడ్ ఎరోటిక్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా వీళ్లిద్దరి ఆన్ స్ర్క్రీన్ రొమాన్స్ ఉండటంతో ఆ పాట ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. సాధారణంగా హర్రర్ జోనర్ లో తీసిన సినిమాలో ప్రేక్షకులను భయపెట్టాలని చూస్తారు.. కానీ ఈ జంట మాత్రం మైమరిపిస్తున్నారు. తెలుగు - తమిళ్ - హిందీ భాషల్లో ఒకేసారి గృహం సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.