Begin typing your search above and press return to search.

సిద్ధు క్రియేటివిటీనే క్రియేటివిటీ

By:  Tupaki Desk   |   7 Feb 2016 3:54 AM GMT
సిద్ధు క్రియేటివిటీనే క్రియేటివిటీ
X
సౌత్ ఇండియాలో మంచి టేస్టున్న హీరోల్లో సిద్దార్థ్ ఒక‌డు. కెరీర్ ఆరంభం నుంచి భిన్న‌మైన సినిమాలు చేస్తూ వ‌స్తున్న సిద్ధు.. టాలీవుడ్ ను వ‌దిలేసి కోలీవుడ్ వెళ్లిపోయాక ఎక్కువ‌గా త‌న మ‌న‌సుకు న‌చ్చిన డిఫ‌రెంట్ మూవీసే చేస్తున్నాడు.ఎన్‌.హెచ్ 4. జిగర్‌ తాండా - కావ్య తలైవన్‌ - ఎనకుల్‌ ఒరువన్ లాంటి సినిమాలు సిద్ధు ఏంటో నిరూపించాయి.ఈ కోవ‌లోనే ఇప్పుడు ‘జిల్ జంగ్ జ‌క్’ అనే డిఫ‌రెంట్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు సిద్ధు.ధీర‌జ్ వైద్యను ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం చేస్తూ త‌న ఇటాకి ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ పై సిద్ధునే స్వ‌యంగా ఈ సినిమాను నిర్మించాడు.

టైటిల్ తోనే జ‌నాల దృష్టిని ఆక‌ర్షించిన సిద్దార్థ్‌.. ఆ త‌ర్వాత కూడా డిఫ‌రెంట్ ప‌బ్లిసిటీతో అద‌ర‌గొడుతున్నాడు. షూట్ ద కురివి అంటూ అనిరుధ్‌, సిద్ధు క‌లిసి పాడిన పాట యూట్యూబ్ లో సెన్సేష‌న్ అయింది. ఇక పోస్ట‌ర్ల గురించి అయితే చెప్పాల్సిన ప‌ని లేదు. భ‌లే వెరైటీగా ఉంటూ ఆక‌ట్టుకుంటున్నాయి.టీజ‌ర్‌, ట్రైల‌ర్ కూడా జ‌నాల్లో సినిమా మీద ఆస‌క్తిని పెంచాయి. ‘కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన విశాల్ చంద్ర‌శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించ‌డం విశేషం. ఆడియో కూడా సూప‌ర్ హిట్ అయింది. ఈ నెల 12న సినిమా విడుద‌ల కాబోతున్న నేప‌థ్యంలో చేసిన కొత్త పోస్ట‌ర్ కూడా భ‌లే వైరెటీగా డిజైన్ చేశారు.రిలీజ్ కు ముందు ఇది కిల్ల‌ర్ పంచ్ అని చెప్పొచ్చు. మొత్తానికి ప్ర‌మోష‌న్లలో క్రియేటివిటీతో కుమ్మేస్తున్న సిద్ధు సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.