Begin typing your search above and press return to search.

స్టాఫ్ కు బొమ్మరిళ్లు వెతుకుతున్నాడు

By:  Tupaki Desk   |   1 Dec 2015 7:30 PM GMT
స్టాఫ్ కు బొమ్మరిళ్లు వెతుకుతున్నాడు
X
బొమ్మరిల్లు హీరో సిద్ధార్ధ్.. ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నానుతున్నాడు. అరణ్మణై2 లో అప్ డేట్స్ తో ఓసారి, జిల్ జంగ్ జక్ అప్ డేట్స్ తో మరోసారి, సమంతతో ట్విట్టర్ లో వార్ పెట్టుకుని ఇంకోసారి, త్రిషతో ఎఫైర్ నడుపుతున్నాడంటూ మరోసారి వార్తల్లోకెక్కాడు. వీటిలో కొన్ని సినిమా సంగతులైతే మరికొన్ని వ్యక్తిగత విషయాలు. అయితే.. వీటిలో ఏదీ వ్యక్తిత్వానికి సంబంధించిన విశేషాలు లేవు.

కానీ ఇప్పుడు ఓ పని చేసి తన మంచి వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు సిద్ధార్ధ. అది కూడా ట్విట్టర్ ద్వారానే కావడం విశేషం. తన ఆఫీస్ లోను - ఇంట్లోనూ పని చేసే మనుషుల కోసం అపార్ట్ మెంట్ చూస్తున్నాడట. అందరినీ ఒకేచోట ఉండేలా ఫ్లాట్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాడట సిద్ధూ. ఏవైనా ఫ్లాట్స్ ఉంటే చెప్పాలంటూ రిక్విస్ట్ కూడా చేశాడు సిద్ధార్ధ. చూడ్డానికి ఇదేదో తన అవసరం కోసం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నా.. తన కోసం పని చేస్తున్న మనుషులకు అపార్ట్ మెంట్స్ తీసి, గూడు కల్పిస్తున్నాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది చేస్తాం.. ఇది చేస్తాం అని కబుర్లు చెప్పే బదులు.. తనకు చేతనైనంతలో కొంతమందికైనా ఉండడానికో ఇల్లు ఇస్తున్నందుకు అభినందించాల్సిందే.

జీతం ఇవ్వడంతో నా పని అయిపోయింది.. ఎలా ఉంటే నాకెందుకు అనుకునే అవకాశం ఉన్నా.. అలా చేయకుండా తన వారికోసం అపార్ట్ మెంట్ బొమ్మరిల్లును(ఉండడానికి మాత్రమే అయినా సరే) అందించడాన్ని అభినందించాల్సిందే. ఇలాగే అందరు స్టార్లు ఆలోచిస్తే.. చాలామందికి సరైన నిలువ నీడ లేని కష్టాలు తగ్గుతాయి.