Begin typing your search above and press return to search.

మాస్ రాజా క్లాస్ హీరో.. కాంబో భలే ఉందే

By:  Tupaki Desk   |   19 July 2019 6:00 AM GMT
మాస్ రాజా క్లాస్ హీరో.. కాంబో భలే ఉందే
X
'RX100' చిత్రం సంచలన విజయం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి. మొదటి సినిమా రిలీజై ఇప్పటికి ఏడాది అయినా రెండవ చిత్రం మొదలు పెట్టలేదు. మధ్యలో ఆ హీరోతో చేస్తున్నాడని.. ఈ హీరోతో చేస్తున్నాడని వార్తలు వచ్చాయి కానీ అవేవీ నిజం కాలేదు. ప్రస్తుతం అజయ్ ఒక మల్టిస్టారర్ కథపై పనిచేస్తున్నాడట. ఈ కథను మాస్ మహారాజా రవితేజకు వినిపించడం.. గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం ఆల్రెడీ జరిగిందట.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోగా సిద్ధార్థ్ ను తీసుకుంటున్నారట. సిద్ధార్థ్ తన కెరీర్ ప్రారంభంలో లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు కానీ అది ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు. ఈమధ్య తమిళ చిత్రాలే చేస్తున్నాడు. 2017 లో డబ్బింగ్ చిత్రం 'గృహం' తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు ఆరేళ్ళ తర్వాత తెలుగులో నటించేందుకు సిద్ధమయ్యాడట. రవితేజ మాస్ హీరో.. సిద్ధార్థ్ క్లాస్ హీరో.. ఈ ఇద్దరి క్లాస్ మాస్ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది.

'మహాసముద్రం' టైటిల్ తో తెరకెక్కన్ను ఈ చిత్రం వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కుతుందని. మాఫియా బ్యాక్ డ్రాప్ యాక్షన్ తో పాటు రొమాంటిక్ డ్రామా ప్రధానంగా చిత్రం సాగుతుందనే టాక్ ఉంది. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా అదితిరావు హైదరీ ని హీరోయిన్ గా ఎంపిక చేశారట. సిద్ధార్థ్ కు జోడీని ఎంపిక చేయాల్సి ఉంది. జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని.. అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.