Begin typing your search above and press return to search.

ఆ డెత్ మిస్టరీ తేల్చనున్న శ్వేతా బసు

By:  Tupaki Desk   |   18 Jan 2018 8:03 AM GMT
ఆ డెత్ మిస్టరీ తేల్చనున్న శ్వేతా బసు
X
కొత్తబంగారులోకం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్.. తెలుగు ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన మాట వాస్తవమే. మొదటి సినిమాలో బాగానే నటించినప్పటికీ ఈమెకి అంతగా అవకాశాలు రాలేదు. వచ్చిన కొద్దో గొప్పో సినిమాలు కూడా ప్లాప్ అవ్వడంతో ఈమెను ఎవరు పట్టించుకోలేదు. అకస్మాత్తుగా ఒక వ్యభిచార స్కాండల్ లో దొరికిపోయి హెడ్ లైన్స్ లో నిలిచింది ఈ బెంగాళి బ్యూటి.

కానీ ఈ మధ్య ఈ భామ కు బాగానే ఆఫర్లు వస్తున్నాయ్. హిందీలో మొన్నీమధ్యనే బద్రి కి దుల్హనియా సినిమా లో ఒక చిన్న పాత్ర చేసిన ఈమె ఇప్పుడు ది టాష్కేంట్ ఫైల్స్ చిత్రం లో ఒక జర్నలిస్ట్ గా కనిపించబోతోంది. "యాక్టర్ గా ఉండటం వల్ల గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఒకే లైఫ్ లో బోలెడు లైఫ్స్ చూడచ్చు. నాకు అన్నిటికంటే డిఫరెంట్ పాత్రలు చేయడం ఇష్టం. మాక్డీ సినిమా లో ట్విన్ రోల్ - బద్రీనాద్ కి దుల్హనియా లో ఊర్మిల పాత్ర - నా చంద్ర నందిని టీవీ సీరియల్ లో ఒక యుద్ధకారిని పాత్ర - ఇప్పుడు టాష్కేంట్ ఫైల్స్ లో రాగిణి ఫుల్ పాత్ర, ఇలా చాలా రకాల పాత్రలు పోషించాను. రాగిణి ఫుల్ ది చాలా ఆసక్తికరమైన పాత్ర. ఒక మాములు జర్నలిస్ట్ ఎలా లాల్ బహదూర్ శాస్త్రి మరణ మిస్టరీ గురించి తెలుసుకుంది అనేది నా పాత్ర. ఈ పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది. " అని అంటోంది శ్వేతా.

ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నసీరుద్దీన్ షా - మిథున్ చక్రబోర్తి లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్వేతా వ్యభిచారం స్కాండల్ లో ఇరుక్కున్నపుడు చాలా మంది తెలుగు హీరోలు మా సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇస్తాం అని భరోసా ఇచ్చారు. కానీ ఆమెకు బాలీవుడ్ లో మాత్రమే అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది. మరి అప్పట్లో మేమున్నాం అంటూ ముందుకి వచ్చిన మన తెలుగు హీరోలు ఇపుడు ఏమైపోయారు అంటారు?