Begin typing your search above and press return to search.

శ్రుతి మాట: కాటమరాయుడు అలా ఉండదు

By:  Tupaki Desk   |   24 Feb 2017 5:18 AM GMT
శ్రుతి మాట: కాటమరాయుడు అలా ఉండదు
X
‘కాటమరాయుడు’ సినిమా అజిత్ తమిళ మూవీ ‘వీరం’కు రీమేక్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ చిత్ర నిర్మాతలు మాత్రం ఇది రీమేక్ కాదు అంటున్నారు. ఐతే ఈ చిత్ర కథానాయిక శ్రుతి హాసన్ స్వయంగా ‘కాటమరాయుడు’ రీమేకే అని కన్ఫమ్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ‘కాటమరాయుడు’ గురించి మాట్లాడింది. ఇది రీమేకే కానీ.. ఒరిజినల్ తో పోలిస్తే చాలా మార్పులుంటాయని చెప్పింది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో నటిస్తుండటం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

‘‘పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా స్పెషల్. అలాగే మా కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ కూడా. నా కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ మూవీ అది. దాని తర్వాత మళ్లీ మేం ‘కాటమరాయుడు’ సినిమాకు కలిసి పని చేశాం. ఈ సినిమా కూడా నాకు చాలా ప్రత్యేకం. ఇది రీమేకే అయినా.. ఒరిజినల్ లాగా ఉండదు. ఎవ్వరూ కూడా రీమేక్ సినిమా చేస్తున్నపుడు ఉన్నదున్నట్లు దించేయాలనుకోరు. లోకల్ ఆడియన్స్ టేస్ట్.. వాళ్ల సెన్సిబిలిటీస్ కు తగ్గట్లుగా మార్పులు చేస్తారు. ‘కాటమరాయుడు’ విషయంలోనూ అలాగే చేశారు. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారు. ఒరిజినల్ తో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది. నా పాత్ర కూడా మార్చారు. ఈ సినిమా కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుంతుంది. పెద్ద హిట్టవుతుంది’’ అని శ్రుతి చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/