Begin typing your search above and press return to search.

శృతి ప్రమోషన్లకు హ్యాండిస్తోందా??

By:  Tupaki Desk   |   22 March 2017 5:25 AM GMT
శృతి ప్రమోషన్లకు హ్యాండిస్తోందా??
X
శృతి హాసన్.. చాలా లేటుగా స్టార్ హీరోయిన్ అయ్యింది. అందుకే గబ్బర్ సింగ్ ఇచ్చిన బ్రేక్ తో తన కెరియర్ రూపు రేఖలే మారిపోయాయని ఇప్పటికీ చెబుతూనే ఉంది. ఇప్పటికే అదే మాట నాలుగైదు ఇంటర్యూలలో చెప్పింది. అయితే లైవ్ లో ''కాటమరాయుడు'' సినిమాను ప్రమోట్ చేయడానికి ఆడియో లాంచ్ కు రాలేదు. ఇప్పుడు చూస్తుంటే టివి ఇంటర్యూలకు కూడా వచ్చేలా కనిపించట్లేదు.

షూటింగ్ సందర్భంగా ఆమెతో రికార్డు చేసిన కొన్ని వీడియోలను బైట్స్ రూపంలో రిలీజ్ చేస్తున్నారు కాటమరాయుడు టీం. పవన్ కళ్యాణ్‌ సినిమా కెరయిర్ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన విషెస్ తెలుపుతూ.. ఈ సినిమా గురించి చెప్పుకొచ్చింది అమ్మడు. సినిమాలో హీరోయిన్ గా తాను వేసిన గెటప్ లోనే శృతి ఇలా బైట్ ఇవ్వడం ఎక్సయిటింగ్ గానే ఉన్నప్పటికీ.. అసలు చేతిలో పెద్దగా సినిమాలు లేని శృతి ప్రమోషన్లకు రాకుండా ఎందుకు హ్యాండిస్తోంది అనేదే ఇప్పుడు పెద్ద టాపిక్ అయిపోయింది. సినిమా రిలీజ్ డేట్ సడన్ గా ప్రకటించేయడం వలన అమ్మడి దగ్గర ప్రమోషన్లకు డేట్లు లేవనే సంగతి తెలుస్తోంది.

అయితే కొందరు మాత్రం కావాలనే ఈగోతో శృతి హాసన్ ప్రమోషన్లకు రావడంలేదు అంటూ ఆరోపిస్తున్నారు కాని.. వాటిలో నిజం లేదంటున్నారు శరత్ మరార్ అండ్ టీమ్. ఖచ్చితంగా రిలీజ్ ముందు రోజైనాసరే శృతితో వన్డే ఫుల్ ఇంటర్యూలు పెట్టిస్తాం అంటున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/