Begin typing your search above and press return to search.

వరుసగా ఈ షాకులేంటి శ్రుతీ

By:  Tupaki Desk   |   28 Nov 2015 7:30 PM GMT
వరుసగా ఈ షాకులేంటి శ్రుతీ
X
శ్రుతి హాసన్ రేంజే వేరిప్పుడు. ఈ ఏడాది బాలీవుడ్ లో గబ్బర్.. టాలీవుడ్ లో శ్రీమంతుడు.. కోలీవుడ్ లో వేదాలం.. మూడూ కూడా వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలే. మూడు భాషల్లోనూ ఆమెతో నటించడానికి బడా స్టార్లు పోటీ పడుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా ఆఫర్లు వస్తున్నాయి శ్రుతికి. కానీ శ్రుతి మాత్రం తన రేంజికి చాలా తక్కువ అనిపించే చిన్న హీరోల పక్కన సినిమాలకు ఒప్పుకుంటూ షాకుల మీద షాకులిస్తోంది.

ఒకప్పుడు టీవీ యాంకర్ గా పని చేసి ఆ తర్వాత హీరోగా మారి.. ఎదిర్ నీచిల్ - వరుత్త పడాద వాలిబర్ సంఘం (తెలుగులో కరెంటు తీగ) - మాన్ కరాటె (తెలుగులో నారా రోహిత్ హీరోగా రాబోతున్న తుంటరి) లాంటి సినిమాలతో పేరు సంపాదించిన శివ కార్తికేయన్ కథానాయకుడిగా రాబోయే సినిమాకు ఈ మధ్యే సంతకం చేసింది శ్రుతి.

ఇప్పుడు మరో అప్ కమింగ్ హీరో విజయ్ సేతుపతితో జట్టు కట్టబోతోంది శ్రుతి. ఈ చిత్రాన్ని హీరో ధనుషే నిర్మించబోతుండటం విశేషం. శివ కార్తికేయన్ - విజయ్ సేతుపతి ఇద్దరూ కూడా ధనుష్ సపోర్టుతో ఎదిగిన వాళ్లే. ఐతే వాళ్లింకా స్టార్ హీరోల రేంజికి ఎదగలేదు. శ్రుతి సూపర్ స్టార్ హీరోయిన్ రేంజిలో ఉంది. పైగా ఆ ఇద్దరు హీరోలు కలర్ తక్కువే. కానీ శ్రుతి పాల మెరుపుతో మెరిసిపోతుంటుంది. కానీ ఇద్దరూ మంచి నటులన్నది మాత్రం వాస్తవం. అందుకే వాళ్లతో సినిమాలు ఓకే చేసినట్లుంది శ్రుతి.