Begin typing your search above and press return to search.

మూడో ఐటెం నెంబర్ చేస్తుందా??

By:  Tupaki Desk   |   24 Aug 2016 10:14 AM GMT
మూడో ఐటెం నెంబర్ చేస్తుందా??
X
ఇప్పటికే రెండుసార్లు ఒకే హీరోతో ఐటెం నెంబర్లను చేసిన హీరోయిన్ మిల్కీ బ్యూటి తమన్నా. అయితే ఈ సుందరి మూడోసారి 'జనతా గ్యారేజ్‌' కోసం అడిగితే కాదనేసింది. ఆ ప్లేసులో కాజల్ వచ్చింది. అయితే ఇప్పుడు మనం మట్లాడుతున్న ఆ ఐటెం రాణి ఈమె కాదండోయ్.

హిందీలో అర్జున్ కపూర్ పక్కన ఒక ఐటెం సాంగ్.. అలాగే తెలుగులో మహేష్‌ బాబుతో ఒక ఐటెం సాంగ్ చేసింది శృతి హాసన్‌. స్వతాహా కత్తిలాంటి డ్యాన్సర్ కావడంతో ఆమె హీరోలకు సైతం మంటలు తెప్పించే స్టెప్పులు వేస్తుంది. పైగా ఒంపుసొంపులను ఆరబోయడంలో ఈమె తరువాతనే ఎవరైనా. తన హొయలను ఒలికిస్తూ అందాలు దారబోయడం అంటే శృతి హాసన్ కు బాగా ఇష్టం. అందుకే ఎప్పుడూ పాటల్లో రెచ్చిపోతుంటుంది. ఇక న్యూస్ ఏంటంటే.. కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ హీరోగా రూపొందిన ''జాగ్వార్'' సినిమా కోసం శృతి హాసన్ ను ఐటెం సాంగ్ చేయమని ఎప్రోచ్ అయ్యారట. ఆ పాటే కనుక చేస్తే.. అది ఈ సెక్సిణి కెరియర్ లో 3వ ఐటెం సాంగ్ అవుతుంది.

దాదాపు 2 కోట్లకు పైగా శృతి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయినా కూడా ఈ ఐటెం సాంగ్ ఆమెతోనే చేయించాలని డెబ్యూటింగ్ ఈరో నిఖిల్ కుమార్ పట్టుబడుతున్నాడట. అది సంగతి.