Begin typing your search above and press return to search.

శృతి సినిమాకి బాహుబలి దెబ్బ

By:  Tupaki Desk   |   24 May 2017 9:28 AM GMT
శృతి సినిమాకి బాహుబలి దెబ్బ
X
బాహుబలి మూవీ ప్రభంజనం కంటిన్యూ అవుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇంకా భారీ వసూళ్లను కొల్లగొడుతూనే ఉంది. ప్రస్తుతం 1600 కోట్ల రూపాయల గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ కు చేరువైన బాహుబలి2.. ఇతర సినిమాలపై బాగానే ప్రభావం చూపుతోంది.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బాహుబలి2 తర్వాత దాన్ని నిలువరించే సినిమా రాలేదు. హిందీలో అయితే.. కొత్త బాలీవుడ్ సినిమాలకు మించి బాహుబలి వసూళ్ల ట్రెండ్ కంటిన్యూ చేస్తేంది. ఈ ప్రభావంతో కొత్త సినిమాల విడుదలకు నిర్మాతలు జంకుతున్నారు. ఈ జాబితాలో శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటించిన బెహెన్ హోగీ తేరీ కూడా చేరింది. నిజానికి ఈ మూవీని జూన్ 2న రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించారు. కానీ బాహుబలి స్పీడ్ ఇంకా తగ్గకపోవడంతో.. ఇప్పుడీ చిత్రాన్ని ఓ వారం పాటు వాయిదా వేసుకున్నారు.

జూన్ 8న బెహెన్ హోగీ తేరీని రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఈ మూవీ.. శృతి హాసన్ దే ప్రధాన పాత్ర. అజయ్ పన్నాలాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీపై.. అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.