శృతి క్లారిటీ ఇచ్చేసింది.

Fri Oct 13 2017 10:03:31 GMT+0530 (IST)

సౌత్ లో ఇప్పటివరకు హీరోల కూతుళ్లలో ఎవరైనా టాప్ స్టార్ హీరోయిన్ అయ్యారు అంటే శృతి హాసన్ ఒక్కరే అని చెప్పాలి. తండ్రి హీరోగా చక్రం తిప్పుతుంటే కూతురు కూడా తనదైన శైలిలో హీరోయిన్ గా చలామణి అవుతోంది. మొదట్లో ఐరేన్ లెగ్ అని టాక్ వచ్చినా ఆ తర్వాత అందరికి గోల్డెన్ లెగ్ అయ్యింది.  దాదాపు సౌత్ స్టార్ హీరోలందరితో శృతి జోడి కట్టేసింది. అయితే సౌత్ లో అమ్మడు కనిపించి చాలా కాలమే అవుతోంది.చివరగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - కాటమరాయుడు సినిమాలో కనిపించిన శ్రుతి మళ్లీ దర్శనం ఇవ్వలేదు. హిందీలో ఆ మధ్యనే బెహేన్ హోగి తెరి అనే సినిమాతో అలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్లు ఒక్కొక్కరు రెండు నెలలకొక సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా లండన్ నుంచి వచ్చిన శృతి కొన్ని ఫ్యాషన్ ఈవెంట్స్ లలో మెరిసింది. ఫైనల్ గా తన ప్రస్తుత సినిమాల గురించి చెబుతూ.. కెరీర్ పై ఓ క్లారిటీ ఇచ్చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం మా ఫాథర్ తో శభాష్ నాయుడు సినిమా షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నాను. అలాగే హిందీలో చేసిన యారా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే చేసింది కొన్ని సినిమాలు అయినా అన్ని లాంగ్వేజిస్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. నేను వెనక్కి తీరిగి చూసుకుంటే నేను ఏం చేశానో నాకు తెలియాలి. నాకు నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తాను. సినిమా రిజల్ట్స్ బట్టి ఏ సినిమా చెయ్యాలి అనే విషయం గురించి కూడా ఆలోచిస్తానని శృతి వివరించింది.