Begin typing your search above and press return to search.

కేన్స్ లో అతణ్ని చూసి శ్రుతి షాక్..

By:  Tupaki Desk   |   23 May 2017 6:34 AM GMT
కేన్స్ లో అతణ్ని చూసి శ్రుతి షాక్..
X
సోషల్ మీడియాలో ఫ్రెండ్ అయిన వ్యక్తి.. ఎక్కడో అనుకోకుండా నేరుగా ఎదురుపడి పలకరిస్తే కలిగే ఎగ్జైట్మెంటే వేరుగా ఉంటుంది. సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. వేరే దేశానికి చెందిన వ్యక్తి.. మరేదో దేశంలో ఇలా ఎదురు పడితే ఎవ్వరైనా ఎగ్జైటవ్వాల్సిందే. స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. శ్రుతికి ఆంగ్ల రచయిత నెయిల్ గైమెన్ అంటే అభిమానం. ఆయనతో ట్విట్టర్ ద్వారా ఫాలోయర్ గా మారడమే కాదు.. ఆయనతో పరిచయం చేసుకుని ఫ్రెండుగా కూడా మారింది. ఐతే తాను కథానాయిక పాత్ర పోషిస్తున్న ‘సంఘమిత్ర’ కోసం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు వెళ్లి అక్కడ రెడ్ కార్పెట్ మీద సందడి చేసిన సంగతి తెలిసిందే.

అక్కడే ఆమెకు నెయిల్ గైమెన్ కనిపించాడు. తాను ఫలానా అని మరోసారి పరిచయం చేసుకోగా.. నెయిల్ చాలా సంతోషించి.. ఆమెను తాను రచన చేసిన ‘హౌ టు టాక్‌ టు గర్ల్స్‌ ఎట్‌ పార్టీస్‌’ అనే హాలీవుడ్‌ చిత్ర ప్రీమియర్‌ షోకు అతిథిగా ఆహ్వానం అందించాడు. ఆయన ఆహ్వానాన్ని మన్నించి శ్రుతి అక్కడ కూడా సందడి చేసింది. ఈ సందర్భంగా శ్రుతీ బహుముఖ పత్రిభ గురించి కేన్స్ వేదికగా నెయిల్‌ గైమెన్‌ తెగ పొగిడేశారు. ప్రతిగా తన అభిమాన రచయిత నెయిల్‌గైన్‌ అంటూ శ్రుతీహాసన్‌ కొనియాడింది. నెయిల్‌ గైమెన్‌ నవలలంటే తనకు చాలా ఇష్టం అని.. ఆయన రాసిన నవలలు చాలా చదివానని శ్రుతీ తెలిపింది. నెయిల్ ను ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉందంటూ ఎగ్జైట్ అయింది శ్రుతి.