Begin typing your search above and press return to search.

శృతి స్కిన్ సీక్రెట్స్ కావాలా?

By:  Tupaki Desk   |   12 Jan 2018 9:55 AM GMT
శృతి స్కిన్ సీక్రెట్స్ కావాలా?
X
గ్లామర్ వరల్డ్ లో స్టార్ హోదాలో వెలిగిపోతున్న వారే కాదు.. సెలబ్రిటీలకు కూడా అందం-ఆకర్షణ చాలా ముఖ్యమైన పాయింట్స్. ముఖ్యంగా అమ్మాయిలకు అయితే మేని మెరుపు ఏ మాత్రం తగ్గినా.. అవకాశాలు కుచించుకుపోతాయి. ఏ మాత్రం తేడా వచ్చినా అభిమాన దేవుళ్లు ఇట్టే పసిగట్టేస్తారు. అందుకే స్కిన్ టోన్ ను మెయింటెయిన్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటారు అందాల భామలు.

గతేడాది కాటమరాయుడు మూవీలో శృతి హాసన్ లుక్ పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. హార్డ్ కోర్ శృతి అభిమానులను కూడా మెప్పించలేకపోయింది ఈ భామ. ఇలాంటి మార్పులన్నీ సహజం అంటూ అప్పట్లో క్లాసులు పీకింది కానీ.. ఇప్పుడీ వయ్యారి స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుందని తెలుస్తోంది. సెలబ్రిటీలకు స్కిన్ ట్రీట్మెంట్ అందించే రష్మి శెట్టి అనే డాక్టర్ దగ్గర కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్న ఈ సౌత్ సుందరి.. మళ్లీ తన పాత మెరుపులను తిరిగి పొందేందుకుక గట్టిగానే ట్రై చేస్తోంది. ఇప్పటికే కొంత పాజిటివ్ రియాక్షన్ కూడా పొందేయడం విశేషం.

తన స్కిన్ కు మళ్లీ పాత సోయగాలను తెచ్చిపెడుతున్న డెర్మటాలజిస్ట్ రష్మి శెట్టితో ఓ సెల్ఫీ దిగిన శృతిహాసన్.. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తన అందమైన ఫ్రెండ్ అని చెబుతోంది. ఒక్క శృతి హాసన్ మాత్రమే కాదు.. రకుల్ ప్రీత్ సింగ్ వంటి పలువురు ఇతర భామలు కూడా ఈ సెలబ్రిటీ డెర్మటాలజిస్ట్ క్లయింట్స్ అని తెలుస్తోంది.