నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

Thu Jun 21 2018 10:58:00 GMT+0530 (IST)

ఏ సినిమా పరిశ్రమలో లో అయినా హీరోయిన్స్ నిర్మాతలుగా మారడం తరతరాల నుంచి వస్తున్నదే. అయితే అందులో ఎక్కువగా సక్సెస్ అయిన వారు లేరు. కొందరిని చూసి భయపడిన వారు మళ్ళి నిర్మాతగా మారడానికి ఇష్టపడలేదు. ఇక ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్స్ మాత్రం కొంచెం కూడా వెనుకడుగు వేయడం లేదు. కథ నచ్చితే సొంతంగా బ్యానర్ సెట్ చేసుకొని సినిమాలు చేసేస్తున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ కూడా ఆ వైపు అడుగులు వేస్తోంది.గత ఏడాది అమ్మడు ఇసిడ్రో మీడియా అనే ప్రొడక్షన్ ను స్థాపించింది. డిజిటల్ మీడియాలో విస్తరింపజేయాలని శృతి చాలా రకాలుగా ప్లాన్స్ వేస్తోంది. యానిమేటర్ల అలాగే సింగర్స్ తో పాటు టాలెంట్ ఉన్న యాక్టర్స్ కి స్పెషల్ ఫ్లాట్ ఫార్మ్ గా చేయాలనీ ప్లాన్ వేశారు. అందుకోసం స్పెషల్ టీమ్ ను కూడా ఈ బ్యూటీ సెట్ చేసుకుంది. ఇకపోతే ఇటీవల కొన్ని చర్చల అనంతరం శృతి ఒక స్క్రిప్ట్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. టాలెంట్ ఉన్న టెక్నీషియన్ ఆధ్వర్యంలో సినిమాను నిర్మించి మంచి నిర్మాతగా గుర్తింపు పొందాలని అనుకుంటోంది.

డైరెక్టర్ జయప్రకాశ్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో మస్కిటో ఫిలాసఫీ ని నిర్మించే యోచనలో ఉన్నారట. దాదాపు ఆ ప్రాజెక్టు ఫిక్స్ అయినట్లు సమాచారం. చాలా రోజులుగా చర్చలు జరిపిన తరువాతే శృతి ఈ నిర్ణయం తీసుకుందట. ఇక జయప్రకాశ్ మంచి దర్శకుడని చెప్పిన స్క్రిప్ట్ లో ఏ తేడా లేకుండా ప్రజెంట్ చేయగలడనే నమ్మకంతోనే ఓకే చేసినట్లు సమాచారం. ఇక శృతి తమిళ్ తెలుగులో రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది.