అతడితో మళ్ళీ శృతి చేస్తోందిగా..

Sat Aug 12 2017 15:02:20 GMT+0530 (IST)

బాలీవుడ్ హీరోయిన్లు మాదిరి కాకుండా మన సౌత్ హీరోయిన్లు వాళ్ళ సొంత విషయాలను చాలా జాగ్రత్తగా సమయం చూసి బయటపెడుతూ ఉంటారు. అందిరికి తెలిసినా కూడా వాటిని పబ్లిక్ లో ఎక్కువగా మాట్లాడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఉన్న సౌత్ హీరోయిన్లు అందరిలో హిట్లు ఫ్లాప్లు రుచి అంటే ఏంటో శృతి హాసన్ కు బాగా  తెలుసు. తెలుగు - తమిళ్ - హింది భాషలలొ నటించిన శృతి ఇప్పుడు తన కెరియర్ ను ఎలా  మలుచుకోవలో ప్లాన్ చేసుకుంటుంది. సంగమిత్ర సినిమా వివాదం నుండి ఇప్పుడే బయటపడిన శృతి మళ్ళీ వార్తలులోకి వచ్చింది. ఎప్పటి నుండో తన ప్రేమ వ్యవహారం మీడియా ముందుకు తీసుకురాకుండా ఉంటున్న శృతి ఈ మధ్య ఒక ఎయిర్ పోర్ట్ లో మళ్ళీ తన ఫారిన్ ఫ్రెండుతో కనిపించింది.

శృతి హాసన్ నటనే కాకుండా సంగీతం పై కూడా మంచి అవగాహన ఉంది. లండన్ లో మ్యూజిక్ పై ఒక డిప్లొమా కూడా చేసింది. ఇప్పుడు అదే లండన్ వాసైన నటుడు  మైఖేల్ కొర్సలే తో డేటింగ్ చేస్తుంది. గుట్టుగా సాగుతున్న ఈ ప్రేమ జంట నిన్న రాత్రి ఎయిర్ పోర్ట్ లో ఇలా కనిపించారు. డేనిమ్ జాకెట్ వేసుకొని సమ్మర్ డ్రెస్స్ లో సింపుల్ గా కనిపించింది శృతి. అలానే తన ప్రియడు కూడా గ్రే టి షర్ట్ వేసుకొని సాదాగా కనిపించాడు. ఎప్పటి నుండో వీళ్ళని వెతికిపట్టుకోవాలిని చూస్తూన్న మీడియాకు ఇలా దొరికేసరికి ఈ సమయం కోసమే ఎదురుచూస్తున్న కెమెరాలు ఒక్కసారి క్లిక్లు ఆగకుండా ఆడాయి. కాకపోతే ఎన్ని కెమెరాలు చుట్టూముట్టిన బెదిరిపోకుండా నెమ్మదిగానే ఉన్నారు ఈ ప్రేమ జంట. కాని డేటింగా అంటే.. నో టాకింగ్ అంటున్నారు.

తెలుగులో వచ్చిన ‘కాటమరాయడు’ అలాగే హిందీలో వచ్చిన ‘బెహేన్ హోగి తేరి’  సినిమాలు అనుకున్నంతగా ఆడకపోవడంతో శృతి ఇప్పుడు చేస్తున్న తమిళ్ సినిమాల పై ఫోకస్ పెట్టింది. తమిళ్ స్టార్ హీరోలు విజయ్ - అజిత్ కుమార్ లతో రెండు సినిమాలలో నటిస్తుంది శృతి హాసన్.