మునుపటిలాగే సన్నగా.. నాజూకుగా మారిందే!

Sun May 26 2019 16:11:16 GMT+0530 (IST)

కొంతమంది హీరోయిన్ల క్రేజే వేరుగా ఉంటుంది.  సినిమాలు చెయ్యనివ్వండి.. చెయ్యకపోనివ్వండి.. ఫ్యాన్ ఫాలోయింగ్ లో పెద్దగా మార్పు రాదు. అలాంటి హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు. శృతి లాగా మరో హీరోయిన్ కనుక గ్యాప్ ఇచ్చి ఉంటే రీ ఎంట్రీలో అవకాశాల కోసం నానా కష్టాలు పడాల్సి వచ్చేది. కానీ శృతికి మాత్రం రీ ఎంట్రీ అనగానే అవకాశాలు వచ్చేశాయి.  ఇక సోషల్ మీడియాలో కూడా తనదైన స్టైల్లో అప్డేట్స్ ఇస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.కొద్ది రోజుల క్రితం శృతి తన ఆంగ్ల గాన మాధుర్యం.. తన్మయత్వం ఎలా ఉంటుందో తెలుపుతూ కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది కదా. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇంగ్లీష్ పాటలు అర్థం అయినవాళ్ళూ..  కాని వాళ్ళు అందరూ జాయింటుగా శృతి సింగింగ్ టాలెంట్ ను ముక్తకంఠంతో మెచ్చుకున్నారు.  ఇదిలా ఉంటే తాజాగా శృతి తన ఇన్స్టా ఖాతా ద్వారా మరో ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "ఎవిరీ అదర్ ఫ్రెకిల్ #వీకెండ్ #సన్నీ డేస్".  క్యాప్షన్ లో శృతి సందేశం ఏంటంటే  ఆల్ట్ జే బ్యాండ్ వారి ఎవిరీ అదర్ ఫ్రెకిల్ పాట వింటూ వీకెండ్ లో చిల్ అవుట్ అవుతున్నాననే.
 
అయితే ఈ ఫోటోలో అతి సులభంగా అందరూ గమనించే అంశం మరొకటి ఉంది.  శృతి మునుపటిలా స్లిమ్ముగా కనిపిస్తోంది. రీ ఎంట్రీ అనేసరికి ఎడాపెడా కసరత్తులు చేసి అనవసరమైన ఫ్యాట్ ను బాడీ నుంచి డిలీట్ చేసిందేమో.  టాప్ యాంగిల్ లో తీసుకున్న సెల్ఫీ కాస్త హాటుగానే ఉంది.  హెయిర్ ను లూజ్ గా వదిలేయడం.. కళ్ళకు గాగుల్స్ పెట్టుకోవడంతో యమా స్టైలిష్ గా ఉంది. ఈ ఫోటో నెటిజనులకు నచ్చడంతో 20 గంటల్లోనే మూడు లక్షలకు పైగా లైకులు కొట్టారు.  "శృతి ఈజ్ బ్యాక్" అని ఒకరు.. "శృతి ఈజ్ ఆల్వేస్ స్టైలిష్" అని మరొకరు కామెంట్లు పెట్టారు. ఇక శృతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న 'లాబం' అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా మరో రెండు మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని సమాచారం.