బాయ్ ఫ్రెండ్ తో శృతి చెట్టాపట్టాల్

Tue Apr 17 2018 11:37:55 GMT+0530 (IST)

స్టార్ హీరోల కూతుళ్ళ పర్సనల్ లైఫ్ మీద మీడియాకే కాదు ప్రేక్షకులకు కూడా చాలా ఆసక్తి ఉంటుంది. అందులో సదరు అమ్మాయి సెలబ్రిటీ అయితే ఇక చెప్పనక్కర్లేదు. అందుకే కమల్ హాసన్ తనయ శృతి హాసన్ మీద స్పెషల్ ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. ఇటీవల సినిమా విషయాలో జోరు తగ్గి అవకాశాలు పూర్తిగా తగ్గించుకున్న శృతి హాసన్ లాస్ట్ ఇయర్ పవన్ తో కాటమరాయుడు చేసింది కాని ఆ సినిమా మెయిన్ మైనస్ పాయింట్స్ లిస్టులో తన పేరే ఫస్ట్ ప్లేస్ లో ఉండటంతో మళ్ళి ఆఫర్స్ ఏమి రాలేదు. బాయ్ ఫ్రెండ్ మైకేల్ కోర్సల్ తో ఎప్పటి నుంచో లవ్ ఎఫైర్ నడుపుతున్న శృతి హాసన్ మాటల్లో అది ఎప్పుడు వ్యక్తపరచలేదు కాని చేతల్లో మాత్రం చూపిస్తూనే ఉంది. బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మైకేల్ ని తోడుగా తీసుకెళ్తున్న శృతి ఎవరైనా తమ జంటను ఫోటో తీసే ప్రయత్నం చేస్తే మాత్రం అడ్డు చెప్పకపోవడం విశేషం.పైన చూస్తున్న ఫోటో ముంబైలో ఒక ప్రైమ్ లొకేషన్ లో శృతి-మైకేల్ షాపింగ్ కోసం వెళ్తుండగా తీసింది. బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని కూల్ క్యాజువల్స్ తో ఇద్దరు ఏదో బర్త్ డే కో లేక పెళ్లికో కానుక కొనుక్కుని వెళ్తున్నట్టు అందులో స్పష్టంగా ఉంది. ఆ మధ్య చెన్నైలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెళ్లి జరిగితే మైకేల్ ను కూడా సాంప్రదాయ తమిళ పంచె కట్టులో అక్కడికి తీసుకెళ్ళిన శృతి నూతన వధూవరులతో జంటగా ఫోటో కూడా తీసుకుంది. అక్కడ కమల్ హాసన్ కూడా ఉండటం మీడియా దృష్టి దాటిపోలేదు. సో శృతి హాసన్ ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం. కాని ఆ మాట అడిగితే మాత్రం కస్సుమంటోంది శృతి. ఏదైనా చెప్పే చేస్తానని తన పర్సనల్ అనుకున్న ప్రతి విషయాన్నీ మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదన్న శృతి పెళ్లికైనా పిలిస్తుందో లేదో అనుమానమే. కమల్ తో శృతి నిజ జీవిత పాత్రలో నటించిన శభాష్ నాయుడు విడుదలకు సిద్ధంగా ఉంది.