Begin typing your search above and press return to search.

చాలా బోల్డ్ గా ఒప్పేసుకుందిగా

By:  Tupaki Desk   |   20 Jan 2018 2:08 PM GMT
చాలా బోల్డ్ గా ఒప్పేసుకుందిగా
X
శృతి హాసన్ కెరీర్ మొదట్లో ఎన్ని సినిమాలు చేసిందో కాని తెలుగు ప్రేక్షకులకు గుర్తుంది మాత్రం గబ్బర్ సింగ్ హీరొయిన్ గానే. అంతకు ముందు ఐరన్ లెగ్ అనే స్టాంప్ తో కొంత కాలం ఇబ్బంది పడిన శృతి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు.రవితేజ, మహేష్ బాబు, సిద్ధార్థ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా అందరితోనూ చెప్పుకోదగ్గ సినిమాలే చేసిన శృతి ఈ మధ్య బాగా స్లో అయిపోయింది. హింది చేసిన సినిమాలన్నీ ఒక్కొక్కటి తిరుగుటపా కట్టడం, పవన్ కళ్యాణ్ తో రెండో సారి చేసిన కాటమ రాయుడు ఫ్లాప్ అవ్వడమే కాక తన లుక్ గురించి కూడా విమర్శలు రావడంతో ఇక్కడ అవకాశాలు ఏవి తనను పలకరించలేదు.

ఈ మధ్య లండన్ కు చెందిన యాక్టర్ కం బిజినెస్ మెన్ మైకేల్ కర్సోల్ తో పబ్లిక్ ఈవెంట్స్ లో కలిసి తిరుగుతున్న శృతి హాసన్ ఎట్టకేలకు పెళ్లి గురించి ఓపెన్ అయిపోయింది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, అలా అనిపించినప్పుడు అందరికి చెబుతానని, తాను ప్రస్తుతమున్న ఏ రిలేషన్ షిప్ అయినా వ్యక్తిగతంగా ఉండాలనే కోరుకుంటున్నానని చెప్పిన శృతి మైకేల్ పేరుని నేరుగా ప్రస్తావించలేదు. తన తల్లితండ్రులు ఇద్దరు సినిమా సెలెబ్రిటీలు కావడం వల్ల తాను ఏర్పరుచుకున్న బంధాన్ని బహిర్గతపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఇప్పుడున్న స్థితి పట్ల తాను సంతోషంగానే ఉన్నట్టు తేల్చి చెప్పింది.

ప్రస్తుతం చేతిలో చెప్పుకోదగ్గ భారీ సినిమాలు లేని శృతి హాసన్ ప్రస్తుతం మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ వ్యవహారాల్లో బిజగా ఉంది. స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ కం సింగర్ అయిన శృతి హాసన్ ఊహించని రీతిలో స్టార్ హీరొయిన్ అయిపోయింది. నాన్నతో కలిసి నిజ జీవిత పాత్రలో నటించిన శభాష్ నాయుడు విడుదల కావలసి ఉంది. కమల్ గాయం కావడం వల్ల షూటింగ్ ఆలస్యమైన ఆ మూవీ సమ్మర్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.