Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మళ్ళీ శృతిమించింది

By:  Tupaki Desk   |   19 Jan 2018 1:46 PM GMT
ఫోటో స్టోరి: మళ్ళీ శృతిమించింది
X
మొన్నామధ్యన కవర్ పేజీమీద ఇప్పుడు శృతిహాసన్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని.. కొత్త ఉత్తేజంతో ముందుకొచ్చింది అంటే అందరూ ఏంటో అనుకున్నారు. కాని నిజానికి అమ్మడు మరోసారి శృతి మించిన అందాలతో ఊరిస్తూ అదే కొత్తదనం అని చెబుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అదిగో ఇప్పుడు ఫెమీనా మ్యాగజైన్ కోసం అమ్మడు ఇచ్చిన ఫోటోషూట్ అదే చెబుతోంది.

ఈ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీకోసం ఒక షూట్లో పాల్గొన్న శృతి.. లోపల పేజీల్లో వేసే ఫోటోల కోసం ఇంకాస్త శృతిమించి సోయగాలను దారబోసింది అనే చెప్పాలి. లోపలి పేజీల్లో ఒక ఫోటోలో అయితే మరోసారి తన క్లీవేజ్ షోతో విజృంభించింది అమ్మడు. మరి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం అంటే ఇదేనా? గతంలో ఇంతకు మించిన ఫోటో షూట్లను అమ్మడు చేసింది కాబట్టి.. అక్కడ ఇంకా ఎక్కువగా తన వయ్యారలను ఒలకబోసింది కాబట్టి.. ఇక్కడ కొత్తగా ఏం అనిపించట్లేదు అంటున్నారు గ్లామర్ లవ్వర్స్.

ఇకపోతే ఇప్పటివరకు తెలుగులో కాని తమిళంలో కాని శృతి హాసన్ కొత్త సినిమాలను ఎందుకు ఒప్పుకోవట్లేదు అనేది మరో మిస్టరీగా మారింది. దీనిపై మాత్రం శృతి హాసన్ స్పందిస్తూ.. తనను నచ్చే ఆఫర్లు రావడం లేదని అంటోందా? లేదంటే తీరిక లేదు అంటుందా? లెటజ్ సీ.