Begin typing your search above and press return to search.

ఘాటు మాత్రమే కాదు.. లేటు కూడా

By:  Tupaki Desk   |   24 May 2016 3:30 PM GMT
ఘాటు మాత్రమే కాదు.. లేటు కూడా
X
సౌత్ లో టాప్ లీగ్ ఉండి.. అందాల ఆరబోతలో ఏ మాత్రం లిమిట్స్ లేని ఏకైక హీరోయిన్ శృతి హాసన్. బాలీవుడ్ ఎంట్రీ తర్వాత అమ్మడి సొగసుల సినిమాలు మరింతగా పెరిగాయి. తెలుగు - తమిళ్ - హిందీ.. ఇలా ఎలాంటి భాషా బేధం లేకుండా.. కుర్రాళ్లను తన అందంతో కట్టిపడేస్తూ ఉంటుది. ఇలాంటి ఎక్స్ పోజింగ్ నిర్మాతలకు కాసులు కురిపించడం విషయంలో పాజిటివ్ అయినా.. అమ్మడిలో మరో యాంగిల్ బయటకు వచ్చింది.

చిన్నా పెద్దా సినిమాల తేడాలు లేకుండా.. ఒకే రేంజ్ లో తన నటనతో, అందంతో ఆకట్టుకోవడం శృతి స్పెషాలిటీ. ఈ హాట్ లుక్ విషయంలో మేకర్స్ కి ఎలాంటి అనుమానం లేదు. కానీ ఘాటు సంగతి వదిలేస్తే.. లేటు విషయంలో మాత్రం శృతి బాగా చిరాకు పెట్టేస్తోందని తెలుస్తోంది. కాస్టింగ్ - క్రూ అంతా రెడీగా ఉంటే సహజంగా 9 - 10 గంటలకు షూటింగ్ లు మొదలుపెడతారు.

శృతి హాసన్ మాత్రం ఏరోజూ 12 గంటల్లోపు సెట్స్ కి రావడం లేదట. పైగా లేట్ అయిందనే ఎక్స్ ప్లెనేషన్స్ కూడా ఏం ఉండవు. వీటిన్నిటికి తోడు రోజూ ఇదే టైంకి షూటింగ్ రావడం అమ్మడికి బాగా అలవాటయిందట కూడా. దీంతో శృతితో చేస్తున్న సినిమా షెడ్యూల్స్ బాగా డిస్టర్బ్ అవుతున్నాయని అంటున్నారు. ప్రతీ విషయంలోనూ పర్ఫెక్ట్ గా ఉండే కమల్ కూతురుగా అరంగేట్రం చేసిన శృతి హాసన్.. ఈ విషయంలో ఇండస్ట్రీ జనాలతో మాటలు పడ్డం ఆశ్చర్యకరమే.