Begin typing your search above and press return to search.

లీగల్‌ నోటీస్‌ అంటున్న శృతి హాసన్‌

By:  Tupaki Desk   |   28 May 2016 11:30 AM GMT
లీగల్‌ నోటీస్‌ అంటున్న శృతి హాసన్‌
X
నిర్మాత పివిపి ఎగ్రిమెంట్‌ ను హానర్‌ చేయినందుకు సెక్సీ బ్యూటి శృతి హాసన్ కు లీగల్‌ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. తరువాత ఆ కేసును కోర్టు బయట పరిష్కరించుకుంది అమ్మడు. అయితే అంతకంటే ముందు.. అసలు తన ఫోటోలను రిలీజ్‌ చేసినందుకు శృతి కూడా తెలుగు ప్రొడ్యూసర్‌ ఒకరికి లీగల్‌ నోటీస్‌ ఇచ్చింది తెలుసా??

ఎవడు సినిమాలోని ఓ పాటలో.. శృతి తన క్లీవేజ్‌ అందాలను బీభత్సంగా దారపోసింది. కాని పాట వీడియోను చూస్తే ఆ క్లీవేజ్‌ తాలూకు సొగసులు మామూలుగానే అనిపించినా.. ఆ పాట చేస్తున్నప్పుడు తీసిన ఫోటోల్లో మాత్రం.. కాస్త ఓవర్‌ గా వల్గర్‌ గా అనిపిస్తుంది మనకు. అసలు ఈ ఫోటోలను నేను బయటకు రిలీజ్‌ చేయొద్దని చెప్పాను.. కాని రిలీజ్‌ చేశారు.. అంటూ అప్పట్లో లీగల్‌ నోటీసు పంపిందట అమ్మడు. మ్యాటర్‌ లోకి వస్తే.. ఈ మధ్యనే ఓ మ్యాగజైన్ కు ఫోజులిచ్చింది శృతి. ఈ షూట్‌ లో దాదాపు తన వక్షోజ సౌందర్యం అంతా కనిపించేలా.. డీప్‌ నెక్‌.. అండ్‌ టోటల్లీ ఓపెన్‌ టాప్స్ ధరించింది. ఇదే షూట్‌ తాలూకు వీడియో ఒకటి కూడా బయటకొచ్చింది. ఈ షూట్‌ టైములో అమ్మడు సెక్సీ.. నాట్ సెక్సీ.. అంటూ ఇచ్చిన సింగిల్‌ వర్డ్ ఆన్సర్లతో ఆ వీడియోను తయారు చేశారులే. అయితే ఆ వీడియో చూస్తే.. వామ్మో శృతి స్కిన్‌ షో మామూలుగా లేదు అని ఎవరైనా అనుకోకమానరు.

ఇక ఆ ఫోటోషూట్ మేకింగ్ వీడియో తయారు చేయడానికి మరో నాలుగైదు కెమెరాలు కూడా అమ్మడిని వీడియో తీశాయట. వాటిలో రికార్డయిన కొన్ని క్లిప్పుల్లో.. చాలా సైడ్‌ యాంగిల్‌ నుండి తీయడం వలన.. అదొక పోర్న్ షూట్‌ అన్నట్లు ఔట్ పుట్ వచ్చిందట. దీనిని ఒకతను తన పోర్టుఫోలియో కు ఉపయోగపడుతుందని యుట్యూబ్‌ లో పెట్టడంతో శృతికి చెర్రెత్తుకొచ్చింది. ఇప్పుడు సదరు మ్యాగజైన్ కి లీగల్‌ నోటీసులు పంపడానికి అమ్మడు సన్నద్దమైందని చెన్నయ్ లో టాక్‌.