Begin typing your search above and press return to search.

శృతి చేస్తాను అంకుల్ అని చెప్పిందట

By:  Tupaki Desk   |   26 Aug 2016 5:30 PM GMT
శృతి చేస్తాను అంకుల్ అని చెప్పిందట
X
మెగా హీరోయిన్ శృతి హాసన్ వరుసపెట్టి ఆ క్యాంపులో బాగానే హిట్లు కొట్టింది. అయితే ఇప్పుడు రెండోసారి పవన్ కళ్యాణ్‌ తో ఒక సినిమా చేస్తూ.. అసలు రిపీట్ చేయబడిన హీరోయిన్ అంటూ చరిత్రకు ఎక్కేసే పనిలో కూడా పడిపోయింది. అయితే ఇక్కడే ఒక అదిరిపోయే విషయం తెలుస్తోంది.

నిజానికి కమల్ హాసన్‌ ఒక ప్రక్కన మెగాస్టార్ చిరంజీవికి మాంచి ఫ్రెండే అయినప్పటికీ.. కమల్ కూతురు శృతి మెగా150లో చేయడానికి బాగానే ఆసక్తి కనబరిచిందట. నయనతార అండ్ అనుష్క వంటి హీరోయిన్లను అసలు ఒక్కసారి కూడా అనుకోని మెగా క్యాంప్.. ముందుగా టాప్ హీరోయిన్లు అయిన సమంత అండ్ శృతిహాసన్ నే సంప్రదించారట. ఆల్రెడీ తమిళంలో చేశాను కాబట్టి తెలుగులో చేయలేని అని సమంత చెబితే.. నేను రెడీ అంకుల్ ప్రక్కన చేయడానికి అంటూ శృతి ఓకే చేసిందట.

కాకపోతే ఒక ప్రక్కన ఒక కొత్త తమిళ సినిమా.. మరో ప్రక్కన పవన్‌ తో చేస్తున్న సినిమా కారణంగా డేట్స్ ఎడ్జస్ట్ చేయలేకపోయింది. అందుకే ఖాళీగా ఉన్న కాజల్ ను తీసుకోవాల్సి వచ్చింది అంటున్నారు సన్నిహితులు. లేదంటే శృతి హాసన్ ను మనం ''ఖైదీ నెం. 150''లో చూసేవారమే.