Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: శృతి మించిపోతోంది

By:  Tupaki Desk   |   2 May 2016 10:50 AM GMT
ఫోటో స్టోరి: శృతి మించిపోతోంది
X
చీరకట్టులో ఎంత పద్ధతిగా ఉంటుందో.. శృతి హాసన్ చేసే ఎక్స్ పోజింగ్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. కేరక్టర్ ను బట్టి తన స్టైలింగ్ మార్చేసుకుని పాత్రలో ఒదిగిపోయే శృతి ఈ మధ్య ఎక్స్ పోజింగ్ లో డోస్ పెంచేస్తోంది. ఈ విషయంలో సినిమాల్లో కొంత లిమిట్ చూపిస్తున్నా.. బైట ఫంక్షన్స్ లో మాత్రం అమ్మడి స్పీడ్ బాగా పెరిగిపోయింది.

ఆ మధ్య సైమా ఉత్సవాల్లో క్లీవేజ్ చూపిస్తూ శృతి హాసన్ చేసిన సందడి జనాలకు ఇంకా గుర్తుంది. ఇఫ్పుడా లిమిట్ ని కూడా దాటిపోయి మరింతగా వయ్యారాలను ఆరబోసేసింది. జీక్యూ మేగజైన్ రీసెంట్ ఎడిషన్ కోసం శృతి హాసన్ ఇచ్చిన పోటో సెషన్ చూస్తే.. ఫ్యాన్స్ కి గుండెల్లో రాయి దిగినట్లు అనిపించడం సహజం. గతేడాది శృతిహాసన్ కెరీర్ బాగానే సాగింది. వెల్ కం బ్యాక్ తో బాలీవుడ్ లోనూ వంద కోట్ల వసూళ్ల హీరోయిన్ అనిపించుకున్న శృతికి.. ఈ ఏడాది ఇంకా కలిసిరాలేదు.

ఎన్నో ఆశలు పెట్టుకున్న రాకీ హ్యాండ్సమ్.. శృతి కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అందుకే అందరి దృష్టిలో పడ్డానికి తన అందాలనే పెట్టుబడి చేసేసింది ఈ భామ. రెడ్ కలర్ డ్రస్ లో.. మిలమిలా మెరిసిపోతున్న శృతి సోయగాలు.. ఫ్యాన్స్ ను మెలిపెట్టేస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ రేంజ్ లో శృతిహాసన్ ఎప్పుడూ అందాలను ప్రదర్శించలేదు. అందుకే.. ఇంకా శృతి మించద్దు శృతీ అంటూ.. ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. త్వరలోనే నాగ చైతన్యతో ఆమె చేస్తున్న ప్రేమమ్‌ సినిమా విడదలవ్వనుంది.