ప్లాన్ మారింది.. మళ్ళీ హీరోయిన్ గానే!

Tue Feb 12 2019 16:07:27 GMT+0530 (IST)

కమల్ హాసన్ వారసురాలిగా ఫిలిం ఇండస్ట్రీలోకి 2009 లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అయన పెద్ద కుమార్తె శృతి హాసన్.  హిందీ.. తమిళం.. తెలుగు..ఇలా మూడు భాషల్లో అవకాశాలు వచ్చినా మూడేళ్ళ పాటు హిట్టు మొహం ఎరగలేదు శృతి.  కానీ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారింది. 'ఎవడు'.. 'రేసు గుర్రం'.. 'శ్రీమంతుడు' లాంటి తెలుగు హిట్స్.. 'వేదాళం' లాంటి తమిళ హిట్ సినిమాల్లో నటించి కెరీర్ లో పీక్స్ కూడా చూసింది. కానీ మళ్ళీ 2017 లో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. సినిమాలు వరసగా ఫ్లాప్ కావడంతో సినిమాలకు దూరం అయింది.శృతి సినిమాలకు దూరం కావడానికి తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సాలే కూడా ఒక కారణమనే టాక్ ఉంది.  ఆ విషయం సంగతేమో గానీ టర్నేషనల్ సింగర్ గా.. రాక్ స్టార్ గా పేరు తెచ్చుకుందామని.. ఒరిజినల్ మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా లండన్ లోనే ఉంటూ వచ్చింది. పోయినేడాది అంతా ఈ ప్రయత్నాల్లోనే బిజీగా గడిపింది శృతి.  కొద్దిరోజుల క్రితం లండన్ లో లైవ్ మ్యూజిక్ కు ఫేమస్ వెన్యూ అయిన ట్రూబడోర్ కాఫీ షాప్ లో మొదటి సారి పెర్ఫార్మన్స్ ఇచ్చింది.  కానీ అదంతా పెద్దగా వర్క్ అవుట్ అయినట్టుగా లేదు.

తాజా సమాచారం ప్రకారం శృతి తన మనసును మార్చుకొని మళ్ళీ సినిమాల్లోకి వెనక్కు వస్తోందని టాక్ వినిపిస్తోంది.  ఇప్పటికే రెండు తమిళ సినిమాలకు కూడా ఒకే చెప్పిందట. ఆ రెండిటిలో ఒక సినిమా హీరో విజయ్ సేతుపతి అని అంటున్నారు. శృతి రీ-ఎంట్రీ కన్ఫాం అయినట్టేనని త్వరలో శృతిని హీరోయిన్ గా అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.  అంటే శృతి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అన్నమాట.