Begin typing your search above and press return to search.

మరీ ఈ స్థాయిలో రెచ్చిపోతే ఎలా శ్రుతీ?

By:  Tupaki Desk   |   29 Aug 2015 12:21 PM GMT


శ్రుతి హాసన్ అందాల ప్రదర్శనకు అభ్యంతరాలేమీ చెప్పదని తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. బలుపు, ఎవడు లాంటి సినిమాల్లో ఆమె ఏ స్థాయిలో రెచ్చిపోయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లోనూ ‘డి-డే’ లాంటి సినిమాతో అక్కడి ప్రేక్షకుల్ని కవ్వించింది. ఐతే అప్పటి డోస్ సరిపోలేదని ఫీలైందో ఏమో.. ఈసారి బ్యాంగ్ బ్యాంగ్ అవతారంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది శ్రుతి. బాలీవుడ్ లో శ్రుతి కొత్త సినిమా ‘వెల్కమ్ బ్యాక్’కు సంబంధించి నాస్ నాస్ మే అనే పాట తాలూకు వీడియోను వదిలారు యూట్యూబ్ లో. ఇది ఓ క్లబ్ సాంగ్. సినిమాలోని ప్రధాన తారాగణమంతా ఈ పాటలో కనిపిస్తుంది.

భారీ సంఖ్యలో డ్యాన్సర్లు.. స్పెషల్ ఎఫెక్టులు.. లైటింగ్ మెరుపులు.. అబ్బో హంగామా మామూలుగా లేదు. కానీ ఎంతమంది ఉన్నా, ఎంత హంగామా ఉన్నా.. అందర్లోకి శ్రుతినే హైలైట్ అయింది. టిపికల్ మేకప్ లో కనిపించిన శ్రుతి.. మతి పోగొట్టే క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. బాలీవుడ్ లో ఇంతకుముందు చేసిందంతా దిగదుడుపే అనిపించేలా కనిపించింది శ్రుతి. ఇప్పటిదాకా ఆమె నాలుగైదు బాలీవుడ్ సినిమాల్లో నటించింది కానీ.. ఏది కూడా కమర్షియల్ గా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో వెల్కమ్ బ్యాక్ పై భారీ ఆశలే పెట్టుకుంది శ్రుతి. అనీస్ బజ్మి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్ అబ్రహాం - నానా పటేకర్ - అనిల్ కపూర్ - పరేష్ రావల్ - డింపుల్ కపాడియా - నసీరుద్దీన్ షా లాంటి భారీ తారాగణం ఉంది. సెప్టెంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.