Begin typing your search above and press return to search.

అర్జెంటుగా బయలుదేరమ్మా శృతి

By:  Tupaki Desk   |   24 March 2017 12:40 AM GMT
అర్జెంటుగా బయలుదేరమ్మా శృతి
X
కొంతమంది హీరోయిన్లు అంతే.. స్టార్డమ్ వచ్చేస్తుంది కాని.. ఆ తరువాత దానిని కాపాడుకోవడానికి పెద్దగా ప్రయత్నించారు. ముఖ్యంగా తమ లుక్ ను కాపాడుకుంటే ఆ స్టార్డమ్ చక్కగానే ఉంటుంది. లుక్కుల్లో తేడా వచ్చేస్తే మాత్రం మొదటికే మోసం వచ్చేస్తుంది. సపోజు తమన్నా ఉందనుకోండి.. ఆమె హీరోయిన్ అయినప్పటినుండి ఇప్పటివరకు కొలతల్లో కొన్ని సెంటిమీటర్లే తేడాలు వచ్చుంటాయ్. కాని శృతి హాసన్ అలా కాదండోయ్.

కొత్తల్లో చాలా స్లిమ్ అండ్ సెక్సీగా ఉన్న శృతి హాసన్.. ఇప్పుడు మాత్రం కాస్త బరువెక్కుతోందనే చెప్పాలి. ''కాటమరాయుడు'' సినిమాలో చూస్తే అమ్మడు బాగా ఒళ్లు చేసిందని ఇట్టే అర్ధమైపోతోంది. పవన్ సరసన పాటల్లో శృతి అందాలను తిలకించిన సినిమా లవ్వర్లు ఎవరైనా కూడా.. అర్జెంటుగా నువ్వు జిమ్ కు బయలుదేరమ్మా శృతి అంటున్నారు. మామూలుగా డ్యాన్సులు చంపేసే ఈ స్పయిసీ బ్యూటి.. స్లిమ్ గా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది. లేదు ఇలా డ్రమ్ములా తయారైతే మాత్రం.. ఇక స్టార్ హీరోలు ఎవరు సైన్ చేస్తారు చెప్పండి?

ఏదో వరుసగా సినిమాలు ఉన్నాయ్ కాబట్టి శృతి హాసన్ కు జిమ్ముకు వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు అనుకోవడానికి.. ఆమె చేతిలో గట్టిగా రెండు సినిమాలు కూడా లేవు. ఎలాగొలా టైమ్ తీసుకుని ఫిట్నెస్ పై ఫోకస్ పెడితే.. ఆమె ఫ్యాన్స్ ఆనందపడతారు!!